వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు ఏదో కొత్త స్కామ్ బయటకు వస్తూనే ఉంది. ప్రస్తుతం వాట్సాప్‌లో వీడియో కాల్ స్కామ్ ఎక్కువగా నడుస్తుంది. ఈ స్కామ్‌లో యూజర్లకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి వారిని బెదిరిస్తారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే దీని నుంచి బయటపడవచ్చు. కొత్త నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎత్తకూడదు. మీ వ్యక్తిగత డేటాను ఎక్కడా షేర్ చేయకండి. కాల్ లిఫ్ట్ చేసే ముందు అవతలి వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. అనుమానాస్పదంగా కాల్స్ వస్తే రిపోర్ట్ చేయండి. ఒకవేళ వీడియో కాల్స్ ఎత్తితే మీ చుట్టుపక్కల మీకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రైవేట్‌గా ఉండేలా చూసుకోండి. వాట్సాప్‌లో వెలుగులోకి వస్తున్న స్కామ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి.