ఈ రోజుల్లో ఫ్రాడ్ యాప్స్ ఎక్కువ అయిపోయాయి. జనాల అవసరాలను క్యాష్ చేసుకుంటూ డబ్బులు ఇచ్చి ఫ్రాడ్ చేస్తున్నారు. తిరిగి చెల్లించినప్పటికీ.. వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ యాప్స్ ద్వారా ఫోన్‌లోని డేటా, ఫైనాన్సియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చోరీ అవుతుంది. వాటి ఆధారంగా వేధింపులు ఎక్కువయ్యాయి. నిజమైన యాప్స్ లాగానే, వాటి లోగోతోనే ఉండే ఈ యాప్స్ నుంచి జాగ్రత్తపడాలని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్. ఫ్రాడ్ యాప్స్ పర్మీషన్స్ ఎక్కువగా అడుగుతాయి. దీంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ల చేతిల్లోకి వెళ్లిపోతుంది. అలాంటి యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలని చెప్తున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్. గూగుల్ 18 యాప్స్‌ని బ్యాన్ చేసింది. AAKredit, Amor Cash, Guyayaba Cash, Easy Credit, Cash Wow, CrediBus, Flash Loan. Préstamo Credito, Préstamo De Credito-Yumi Cash, Rapido Credito, FinuppLEnding, 4S Cash, True Naira, Easy Cash ఆ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.