ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో ఇటీవలే రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. అవే ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రోలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇన్‌ఫీనిక్స్ నోట్ 40 ప్రో ప్లస్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ రెండు ఫోన్లూ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి.