వివో బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన టీ3ఎక్స్ 5జీ మనదేశంలో లాంచ్ చేసింది. వివో టీ3ఎక్స్ 5జీ ధర మనదేశంలో రూ.13,499 నుంచి ప్రారంభం కానుంది. అయితే లాంచ్ ఆఫర్లను ఉపయోగించి రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. వివో టీ3ఎక్స్ 5జీ సేల్ మనదేశంలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి మొదలవనుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ3ఎక్స్ రన్ కానుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉన్న 6000 ఎంఏహెచ్ బ్యాటరీని వివో ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది. వివో టీ3ఎక్స్ 5జీలో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్లను ఫోన్ వెనకవైపు చూడవచ్చు. ముందువైపు ఉన్న 8 మెగాపిక్సెల్ లెన్స్ ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ కోసం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను అందించారు.