NASA: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సరికొత్త టైమ్ ను రూపొందించబోతోంది. చంద్రుడిపై ప్రామాణిక టైమ్ ను సెట్ చేయబోతోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం నాసాకు కీలక దేశాలు జారీ చేసింది.
NASA To Create Lunar Time Standard: టైమ్ అనేది ఒక్కోదేశంలో ఒక్కోలా ఉంటుంది. అమెరికాకు, భారత్ కు మధ్య సుమారు 12 గంటల తేడా ఉంటుంది. అంతేకాదు, ప్రతి దేశానికి దేశానికి నడుమ సమయంలో వ్యత్యాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రుడితో పాటు ఇతర గ్రహాల మీద సమయం ఎంతో తెలుసుకునేలా లూనార్ స్టాండర్ట్ టైమ్ ను ఫిక్స్ చేయాలని ఆదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాను ఆదేశించింది. చంద్రుడి మీద ప్రయోగాలకు ఆయా దేశాలతో పాటు ప్రైవేటు సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
2026 నాటికి చంద్రుడి మీద ప్రామాణిక టైమ్ రెడీ!
2026 డిసెంబర్ 31 లోపు చంద్రుడిపై ప్రామాణిక సమయాన్ని తయారు చేయాలని వైట్ హౌస్ నిర్ణయించింది. దానికి కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ LTC అని పేరు పెట్టింది. నాసా తో పాటు మరో నాలుగు సంస్థలకు కలిపి ఈ బాధ్యతలు అప్పగించింది. ఇదంతా ఎందుకు చేసిందంటే భూమి మీద తయారు చేసిన గడియారాలు చంద్రుడి మీద రోజులో 58.7 మైక్రోసెకండ్స్ కోల్పోయి చూపిస్తున్నాయి. సో ఏవైనా రేపు ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు ప్రతీ సెకన్ ఇంపార్టెంట్ కాబట్టి నేవిగేషన్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే చంద్రుడి మీద స్టాండర్డ్ టైమ్ సెట్ చేసుకుని దానికి తగినట్లుగా ప్రయోగాలు చేయటం మంచిదని అది ఆర్టిమెస్ ప్రయోగాలకు చాలా ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. అందుకే ఇప్పుడు లూనార్ టైమ్ జోన్ ప్రతిపాదనలు వచ్చాయి.
"నాసాతో పాటు ప్రైవేట్ కంపెనీలు, అంతరిక్ష సంస్థలు చంద్రుడు, అంగారక గ్రహంతో పాటు పలు గ్రహాలపై పరిశోధనలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయా మిషన్లకు సంబంధించిన భద్రత, కచ్చితత్వం కోసం ఖగోళ సమయ ప్రమాణాలను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. అందుకే, అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’ అని వైట్ హౌస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ డిప్యూటీ డైరెక్టర్ స్టీవ్ వెల్బీ వెల్లడించారు. “అంతరిక్షంలోని ఆయా స్థానాల్లో సమయం ఒక్కోలా ఉంటుంది. అందుకే, అంతరిక్షంలో ఆపరేటర్ల మధ్య సమయం విషయంలో కచ్చితత్వం అవసరం. చంద్రుడి మీద ప్రామాణిక సమయాన్ని రూపొందించడం నావిగేషన్, కమ్యూనికేషన్‌లకు చాలా కీలకం కానుంది" అని వెల్బీ చెప్పారు.
లూనార్ స్టాండర్డ్ టైమ్‌తో కలిగే లాభం ఏంటంటే?
చంద్రుడిపై ప్రామాణిక సమయాన్ని నిర్థారించేందుకు వాణిజ్యం, రక్షణ, రవాణా శాఖలతో కలిసి పని చేయాలని వైట్ హౌస్ నాసాను ఆదేశించింది. ఈ సమయాన్ని రూపొందించడం వల్ల భూమి, చంద్రుని మధ్య ప్రాంతమైన సిస్లూనార్ స్పేస్‌లో మిషన్ల కోసం నావిగేషన్, ఇతర కార్యకలాపాలను మెరుపరిచే అవకాశం ఉంటుంది. లూనార్ టైమ్ స్టాండర్డ్ ను ఏర్పాటు చేయడానికి భూమి మీద ఉన్న ప్రమాణాల్లోని కీలక అంశాలను స్వీకరించవచ్చని సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ సూచించింది. భూమ్మీద ఉన్న అటామిక్ క్లాక్స్ ద్వారా టెరెస్ట్రియల్ టైమ్ సెట్ చేయబడినట్లే, చంద్రుని మీద కూడా లూనార్ టైమ్ ను సెట్ చేయాల్సి ఉంటుందని వైట్ హౌస్ తెలిసింది. ఇది మూన్ మీద చేపట్టే మిషన్లు, స్పేస్ షిప్ లు, ఉపగ్రహాలు కచ్చితత్వంతో పనిచేయడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.
ఒక్క రష్యాలోనే 11 టైమ్ జోన్స్
మనం ఈ భూమ్మీద రకరకాల ప్రాంతాలకు ముందుగా ఓ టైమ్ జోన్ ని సెట్ చేసుకుని పెట్టుకున్నాం. సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరిగే ప్రాసెస్ లో ఏ పార్ట్ మీద సూర్య రశ్మి ఏ టైమ్ లో పడుతుందో అంచనా వేసుకుని టైమ్ జోన్ తయారు చేసుకున్నాం. ఇండియాలో అయితే ఇండియన్ స్టాండర్ట్ టైమ్ అని..అమెరికాలో అయితే ఈస్ట్రన్ స్టాండర్ట్ టైమ్, సెంట్రల్ స్టాండర్ట్ టైమ్ అని, మౌంటైన్ అని, పసిఫిక్ స్టాండర్ట్ టైమ్ అని నాలుగైదు రకాల టైమ్ జోన్స్ ఉంటాయి. రష్యా పెద్ద దేశం కాబట్టి ఆ దేశంలో ఏకంగా 11 టైమ్ జోన్స్ ఉంటాయి. ఇలా ప్రపంచం మొత్తం మీద 24 టైమ్ జోన్స్ ను ప్రజలు ఫాలో అవుతున్నారు. ఇన్ని టైమ్ జోన్స్ కాదు మీ భూమి మీద టైమ్ ఎంతైంది అని పైనుంచి ఎవరన్నా అడిగారనుకోండి చెప్పటానికి ఒక టైమ్ ఉండాలి కదా అందుకే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ UTC అని ఇంకో టైమ్ జోన్ కూడా ఉంటుంది. దీన్ని ఫాలో అవరు బట్ ఇది టైమ్ జోన్స్ అన్నింటికీ మీన్ టైమ్ అన్నమాట.
అటు 1972లో అపోలో 17 మిషన్ ద్వారా చంద్రుడి మీద తొలిసారి అడుగు పెట్టిన ప్రాంతానికి 2026లో మరోసారి వెళ్లాలని అమెరికా పరిశోధన సంస్థ నాసా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే లూనార్ స్టాండర్ట్ టైమ్ ను ఫిక్స్ చేయాలని నిర్ణయించింది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది