OnePlus 10T: మునుపెన్నడూ లేని ఫీచర్‌తో వన్‌ప్లస్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. అదే వన్‌ప్లస్ 10టీ.
వన్‌ప్లస్ 10టీ లాంచ్ త్వరలోనే జరగనుంది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం... ఈ ఫోన్‌లో 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉండనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నారు. వన్‌ప్లస్ గతంలో వచ్చిన మోడళ్లలో 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌నే అందించింది. త్వరలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ 10టీ ఈ రికార్డును కూడా బద్దలుకొట్టనుంది.
డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ ఈ వివరాలను లీక్ చేశారు. ఈయన వీబోలో పేర్కొన్న వివరాల ప్రకారం వన్‌ప్లస్ 10టీలో 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉండనుంది. 16 జీబీ ర్యామ్ అందించే మొదటి వన్‌ప్లస్ ఫోన్ ఇదే కానుంది.
దీని ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీవో 2.0 అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. హెచ్‌డీఆర్10 ఫీచర్‌ను ఈ ఫోన్ చేయనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్‌కు ప్రొటెక్షన్ అందించనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అరగంటలోపే బ్యాటరీ ఫుల్‌గా చార్జ్ కానుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. డ్యూయల్ స్పీకర్ సెటప్ ఇందులో ఉండనుంది. బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!