అన్వేషించండి

Apple iPhone 17 Launch 2025: నేడే యాపిల్ ఈవెంట్.. ఐఫోన్ 17 కొత్త సిరీస్ మొబైల్స్, కొత్త స్మార్ట్ వాచ్, ఎయిర్ పాడ్స్ లాంచింగ్

Apple iPhone 17 Launch | ఆపిల్ కంపెనీ సెప్టెంబర్ 9న రాత్రి లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తుంది. కాలిఫోర్నియాలోని కుపెర్టినో ఆపిల్ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

iPhone 17 Launch 2025: ఆపిల్ ఐఫోన్ 17 లాంచ్ 2025: ఐఫోన్ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రానే వచ్చింది. నేడు (సెప్టెంబర్ 9, 2025)న యాపిల్ కంపెనీ Awe Dropping ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:30 గంటలకు యాపిల్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్, ఆపిల్ టీవీ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఈ ఈవెంట్లో యాపిల్ కంపెనీ లేటెస్ట్ ఫోన్ సిరీస్ 17, ఐపాడ్స్ ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 17 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఎయిర్‌పాడ్స్ ప్రో 3, పలు ఇతర ఉత్పత్తులను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series)

ఈ ఈవెంట్లో యాపిల్ కంపెనీ అతిపెద్ద ప్రకటన కొత్త ఐఫోన్ 17 సిరీస్ లాంచింగ్. ఇందులో ఐఫోన్ 17 బిగ్ డిస్‌ప్లే, 24MP ఫ్రంట్ కెమెరా, ప్రోమోషన్, ఆల్వేస్- ఆన్ డిస్‌ప్లే అనే 4మోడళ్లు ఉండవచ్చు.

ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air) –  ఐఫోన్ 17 ఎయిర్ అల్ట్రా- అతి సన్నని డిజైన్ ఇది. 6.6-అంగుళాల స్క్రీన్, A19 చిప్, సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది.

ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) – ఐఫోన్ 17 ప్రోలో  కొత్త కెమెరా బార్ డిజైన్, A19 ప్రో చిప్ ఉంటుంది. 48MP టెలిఫోటో లెన్స్, సెల్ఫీల కోసం 24MP ఫ్రంట్ కెమెరా.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ (iPhone 17 Pro Max) - మందంగా ఫ్రేమ్, ప్రో ఫీచర్లతో పాటు పెద్ద బ్యాటరీ సపోర్ట్ మీ సొంతం.

ఆపిల్ వాచ్ సిరీస్ 11 (Apple Watch Series 11)

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ తో పాటు కొత్త వాచ్ సిరీస్ 11 కూడా లాంచ్ చేయవచ్చు. దీని డిజైన్ అలాగే ఉంటుంది. కానీ దీనికి ఫాస్టెస్ట్ S-సిరీస్ చిప్, 5G మోడెం లభిస్తుందని అనుకుంటున్నారు. బ్లడ్ ప్రెజర్ (BP) మానిటరింగ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉండటంతో ఈసారి మార్కెట్లోకి రాకపోవచ్చు.

ఆపిల్ వాచ్ అల్ట్రా 3 (Apple Watch Ultra 3)

ఆపిల్ వాచ్ అల్ట్రా 3 పెద్ద డిస్‌ప్లే, సన్నని బెజెల్స్, కొత్త S11 చిప్ ఉంటుంది. శాటిలైట్ కనెక్టివిటీతో పాటు 5G సపోర్ట్‌ లభిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ఫీచర్ చేర్చే అవకాశం ఉంది.

ఆపిల్ వాచ్ SE 3 (Apple Watch SE 3) 

2022 తర్వాత ఆపిల్ మొదటిసారిగా తన వాచ్ SE 3ని రిఫ్రెష్ చేయనుంది. ఇది ప్లాస్టిక్ బాడీ, పెద్ద డిస్‌ప్లే, కొత్త చిప్‌ పొందవచ్చు. మెరుగైన పనితీరును ఆశిస్తున్నారు. 

ఎయిర్‌పాడ్స్ ప్రో 3 (AirPods Pro 3 

కొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని H3 చిప్, హార్ట్ బీట్ చెకింగ్, తిరిగి రూపొందించిన ఛార్జింగ్ కేసుతో రానుంది

Software Updates

హార్డ్‌వేర్‌తో పాటు, ఆపిల్ iOS 26, వాచ్‌ ఓఎస్ 26, ఇతర అప్‌డేట్స్ కూడా విడుదల చేస్తుంది. వీటిని ఇప్పటికే WWDCలో చెక్ చేశారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2, కొత్త ఆపిల్ టీవీ 4K, రెండవ హోమ్‌పాడ్ మినీ లేదా అప్‌డేటెడ్ విజన్ ప్రో హెడ్‌సెట్ వంటి అదనపు ఉత్పత్తులను కార్యక్రమంలో సంస్థ ప్రదర్శించవచ్చు. వీటిని ఏడాది చివరి నాటికి ప్రారంభించవచ్చు.

భారతదేశంలో ధరలు ఎలా ఉంటాయంటే..

అనలిస్ట్ సంస్థ టెక్‌ఆర్క్ ప్రకారం, భారతదేశంలో ఐఫోన్ 17 ప్రారంభ ధర దాదాపు రూ. 86,000 ఉండవచ్చు. ఐఫోన్ 16 లాంచ్ ధర రూ. 79,900 దాదాపు 7 వేలు  ఎక్కువ. డాలర్-రూపాయి మారకం రేటు అందుకు కారణం. గత కొన్ని సంవత్సరాలుగా ఐఫోన్ ధర ప్రతి ఏడాది సగటున 7.6% పెరుగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు 5.2% తగ్గింది. 

యాపిల్ ఈవెంట్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి
తేదీ – సెప్టెంబర్ 9, 2025 ఆపిల్ ప్రధాన కార్యాలయం కుపెర్టినో, కాలిఫోర్నియా

సమయం – మంగళవారం రాత్రి 10:30 (IST)

మీరు ఈవెంట్‌ను మీ ఫోన్‌లో ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, ఆపిల్ టీవీ యాప్, ఆపిల్ యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ వీక్షించవచ్చు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group 1 Results Cancel: టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
PK Vs Revanth:  రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
Pawan Kalyan News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Allu Business Park Controversy: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group 1 Results Cancel: టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ.. గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, ఇదెక్కడి ట్విస్ట్!
PK Vs Revanth:  రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిషోర్ - వదిలేది లేదని హెచ్చరిక - అసలేం జరిగిందంటే?
Pawan Kalyan News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Allu Business Park Controversy: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Kajal Aggarwal Accident News: నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ
నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Embed widget