అన్వేషించండి
iPhone Ban Story : ఆ దేశంలో ఐఫోన్ నిషేదం.. చౌకగా దొరికే దేశమేంటో.. వాటి వెనుక కారణాలు ఇవే
iPhone Prices Around the World : ఆపిల్ సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్ విడుదల చేయనుంది. ఈ సమయంలో ఏ దేశంలో ఐఫోన్ వాడకాన్ని నిషేందించారో.. దానివెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 16ని బాన్ చేసిన దేశమిదే
1/7

అక్టోబర్ 2024లో ఇండోనేషియా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఐఫోన్ 16పై నిషేధం విధించింది. ఎందుకంటే ఆపిల్ ఆ దేశంలో పెట్టుబడులు పెడతామని వాగ్దానం చేసింది. కానీ 1.71 ట్రిలియన్ రూపాయిల వాగ్దానంలో కేవలం 1.48 ట్రిలియన్ రూపాయిలు మాత్రమే పెట్టుబడి పెట్టింది. దీనివల్ల TKDN/IMEI సర్టిఫికెట్ జారీ కాలేదు. దీంతో అక్కడ ఫోన్ అమ్మకాలు చట్టవిరుద్ధంగా ప్రకటించారు.
2/7

ఆపిల్ తరువాత తన ప్రతిపాదనను 1 బిలియన్ డాలర్లకు పెంచింది. బాటమ్ ద్వీపంలో ఎయిర్ట్యాగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఇండోనేషియా పరిశ్రమల మంత్రి అగస్ గుమివాంగ్ ఇది సరిపోదన్నారు. ఐఫోన్లో ఉపయోగించే పార్ట్స్‌లో స్థానికంగా తయారు చేసినవి కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఆపిల్ 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి, స్థానిక R&D, తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకుని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2025లో ఆపిల్, ఇండోనేషియా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. దీని తరువాత ఐఫోన్ 16పై నిషేధం తొలగించింది.
Published at : 07 Sep 2025 01:11 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















