iPhone 17 Air: లాంచ్‌కు ముందే ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్లు, లుక్ లీక్ ! అతి సన్నని వేరియంట్ వచ్చేస్తోంది
iPhone 17 Air: సెప్టెంబర్ 9, 2025 న Apple iPhone 17 సిరీస్ ను విడుదల చేయనుంది. ఇందులో అత్యంత సన్నని ఐఫోన్ మోడల్ మార్కెట్లోకి విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది.

iPhone 17 Air: టెక్ దిగ్గజం Apple సెప్టెంబర్ 9న తన iPhone 17 సిరీస్‌ను విడుదల చేయనుంది. యాపిల్ కంపెనీ iPhone 17 Air అనే కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది ఇప్పటివరకు iPhone లో సన్నని మోడల్ అని చెబుతున్నారు. దీని డిజైన్, ఫీచర్ల గురించి కొన్ని నెలల నుంచి వదంతులు వినిపిస్తున్నాయి మరియు ఇప్పుడు లీక్ అయిన కేసు దాని గురించి మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించింది.
లీక్ అయిన వివరాలు ఇవే
iPhone 17 సిరీస్‌లో తాజాగా iPhone 17, iPhone 17 Aఎయిర్, iPhone 17 ప్రో, iPhone 17 Pro Max నాలుగు వేరియంట్లు మార్కెట్లోకి రానున్నాయి. నివేదికల ప్రకారం, ఈసారి iPhone 17 Plusని ఉండదని వినిపిస్తోంది. దాని స్థానంలో iPhone 17 Air లాంచ్ చేస్తున్నారని లీక్ అయింది.
MacRumors రిపోర్ట్ ప్రకారం, Dbrand, Nudient మరియు Pitaka వంటి కంపెనీలు iPhone 17 Air కేసులను జాబితా చేశాయి. ఈ కేసుల నుండి, దాని కెమెరా కటౌట్ iPhone 16e వలె ఉంటుందని తెలుస్తోంది, అంటే ఇది సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉండవచ్చు. ఈ సమాచారం మొదట వచ్చిన డ్యూయల్ కెమెరా సెటప్ వాదనకు పూర్తిగా భిన్నంగా ఉంది. దీనితో పాటు, కేసు డిజైన్ స్క్రీన్ సైజు గురించి కూడా సూచనలు ఇచ్చింది.
iPhone 17 Air ఫీచర్లు
లీక్ అయిన నివేదికల ఆధారంగా iPhone 17 Airలో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉండవచ్చు. ఈ మోడల్‌లో మీరు 256GB, 512GB తో పాటు 1TB వేరియంట్‌ల వంటి మూడు వేరియంట్స్ అందుబాటులోకి రానున్నాయి. అలాగే, దాని డిజైన్ దానిని ఇప్పటివరకు అత్యంత సన్నని iPhone వేరియంట్‌గా మారనుంది. ఐఫోన్ 17 ఎయిర్ కేవలం 5.5mm మందం ఉండనుంది. ఫోన్‌లో కొత్త A18 Bionic చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో ఇంటర్నల్ బిల్డ్ అయిన Apple Intelligence ఫీచర్‌తో పాటు 48MP రియర్ కెమెరా, యాక్షన్ బటన్, క్యాప్చర్ బటన్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మీరు ఫోన్‌లో ఫిజికల్ సిమ్‌కు బదులుగా ఇ-సిమ్ వాడాలి.
iPhone 17 Air ప్రత్యేకత ఏంటి..
iPhone 17 Air కొత్తగా వస్తున్న డిజైన్. సన్నని డిజైన్‌గా మారనుంది. కొత్త ప్రాసెసర్, పవర్ ఫుల్ కెమెరా, పోర్ట్‌లెస్ డిజైన్ దీనిని ప్రత్యేకంగా మార్చుతాయి. లాంచ్ చేయడానికి ముందే, ఈ స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రపంచంలో ఆసక్తి పెంచింది.
Samsung గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌కు పోటీ
iPhone 17 Air వేరియంట్ Samsung కంపెనీ అత్యంత సన్నని ఫోన్ Galaxy S25 Edgeకి గట్టి పోటీని ఇవ్వనుందని అంతా భావిస్తున్నారు. Samsung ఇటీవల ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. ఇ హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలను తీయడానికి వాడవచ్చు. ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చారు. దీంతో మీరు వైడ్ యాంగిల్ ఫొటోలను తీసుకోవచ్చు.సెల్ఫీల కోసం అయితే 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 3,900 mAh బ్యాటరీ ఉంది. ఇంది మంచి బ్యాకప్‌ను అందిస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కనుక అంటే ఫోన్ త్వరగా ఛార్జింగ్ అవుతుంది.






















