Jio Broadband OTT Plan: జియో ఫైబర్ ప్లాన్ - రూ.888తో అదిరిపోయే బెనిఫిట్స్, ఆ ఓటీటీలన్నీ ఉచితం
జియో సరికొత్త ఓటీటీ ఫ్లాన్ ను పరిచయం చేసింది. రూ.888 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో అపరిమిత డేటాతో పాటు, ఏకంగా 15 ఓటీటీ యాప్ లకు స్పెషల్ యాక్సెస్ అందిస్తోంది.
Jio launches new premium OTT broadband data plan: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉన్నది. తాజాగా మరో అద్భుతమైన ప్లాన్ ను పరిచయం చేసింది. అపరిమిత డేటాతో కొత్త పోస్ట్ పెయిడ్ విడుదల చేసింది. నెలకు కేవలం రూ. 888తో ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. జియో ఫైబర్, జియో ఎయిర్ పైబర్ వినియోగదారులకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.
15 టాప్ యాప్స్ కు యాక్సెస్
తాజాగా ప్లాన్ తో 30 ఎంబీపీఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ డేటా అందించనున్నట్లు జియో వెల్లడించింది. అంతేకాదు, ఏకంగా 15 టాప్ ఓటీటీ యాప్స్ కు యాక్సిస్ అందిస్తోంది. వీటిలో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జియో సినిమా, గేట్ ప్లే, సోనీ లివ్, జీ5, డిస్కవరీ ప్లస్, ఆల్ట్ బాలాజీ సహా పలు ఓటీటీలు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ను బేస్ స్పీడ్ ప్లాన్ తో డేటాను పొందే అవకాశం ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే వినియోగదారులు 10 ఎంబీపీఎస్ లేదంటే 30 ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఇప్పటికే ఉన్నా కూడా, రూ. 888 పోస్ట్ పెయిడ్ ప్లాన్ చక్కటి స్ట్రీమింగ్ అనుభూతిని కల్పించనుంది.
మే 31 వరకు అందుబాటులోకి రూ. 888 ప్లాన్
జియో తీసుకొచ్చిన లేటెస్ట్ ఓటీటీ ప్రీపెయిడ్ ఆఫర్ మే 31 వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ వెల్లడించింది. ఆ ప్లాన్ తో చక్కటి వినోదాన్ని పొందే అవకాశం ఉంటుంది. హై స్పీడ్ డేటా, 15 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా అందుబాటులోకి తెచ్చిన జియో ఐపీఎల్ ధన్ ధనా ధన్ ఆఫర్ కూడా ఈ ఫ్లాన్ కు వర్తిస్తుంది. JIO DDD ఆఫర్, మే 31 వరకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ను T20 సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. జియో కొత్త ఫ్లాన్ ప్రకారం సబ్‌స్క్రైబర్లు తమ జియో హోమ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌పై 50 రోజుల డిస్కౌంట్ క్రెడిట్ వోచర్ పొందే అవకాశం కల్పిస్తోంది.
గతంలో జియో ఫ్లాన్ ఎలా ఉంది?
గతంలో జియో ఫైబర్ రూ.1,499 ప్లాన్‌ని కలిగి ఉన్న కస్టమర్లకు మాత్రమే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్ సెకండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో కస్టమర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ల యాక్సెస్ లేదు. అటు ఎయిర్ ఫైబర్ కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ కోసం నెలకు రూ.1,499, అంతకంటే ఎక్కువ ప్లాన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా తీసుకొచ్చిన రూ. 888 ప్లాన్ తో అపరిమిత డేటాతో పాటు చక్కటి స్ట్రీమింగ్ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. ఈ లేటెస్ట్ ప్లాన్ జియో ఫైబర్ తో పాటు జియో ఎయిర్ పైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఆకర్షణీయమైన ఈ ప్లాన్ తో మరింత మంది చందాదారులను చేర్చుకోవాలని జియో భావిస్తోంది.
Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!