![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mother's Day Gifts Ideas: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!
అమ్మ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. వారిని మరింత సంతోషంగా ఉంచాలంటే అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలి. మదర్స్ డే సందర్భంగా ఈ టెక్ గిఫ్ట్స్ వారిని సర్ ప్రైజ్ చేసేయండి.
![Mother's Day Gifts Ideas: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి! Mothers day gifts ideas check top 5 neckband earphones Mother's Day Gifts Ideas: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/10/200ea9ffbf654536491822cfeaa12c6a1715347384436239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mother's Day Gifts Ideas: పిల్లల కోసం ప్రతిక్షణం కష్టపడుతుంది అమ్మ. పిల్లలు వేసే ప్రతి అడుగులో తను తోడు, నీడై ఉంటుంది. కష్టసుఖాల్లో వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఉన్నత స్థాయికి చేరేలా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మలకూ ఓ రోజు ఉంది. అదే మదర్స్ డే. ఆ రోజు అమ్మకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ మరింత సంతోష పెట్టండి. అమ్మకోసం వీలుంటే ఈ టెక్ గిఫ్ట్స్ ఇచ్చి సంతోషాన్ని నింపండి.
మదర్స్ డేకు ఈ గిఫ్ట్స్ ప్లాన్ చెయ్యండి
అమ్మ నిరంతరం కష్టపడుతూ బాగా అలసిపోతుంది. ఆమెకు కాస్త రిలాక్స్ అయ్యేందుకు చక్కటి సంగీతాన్ని ఆస్వాదించేలా, ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్ అందించండి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు, ప్రయాణాల్లో మ్యూజిక్ ఎంజాయ్ చేసేలా చూడండి. సంగీతాన్ని ఇష్టపడే అమ్మల కోసం ఈ టాప్ 5 నెక్ బ్యాండ్స్ లో ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వండి.
1. UBON CL-4080 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్
UBON CL-4080 చాలా సౌకర్యంగా, సింపుల్ డిజైన్ ను కలిగి ఉంటుంది. వాకింగ్, వర్కౌట్స్, జర్నీ చేస్తున్న సమయంలో దీన్ని ఉపయోగించవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 40 గంటలపాటు ప్లే టైమ్ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ను కలిగి ఉంటుంది. దీని ధర కేవలం రూ. 962.
2. Rockerz 330ANC బోట్
ఇండియాలో బెస్ట్ నెక్ బ్యాండ్ boAt Rockerz 330ANC. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో చక్కటి సౌండ్ అందిస్తుంది. ఇందులోని లేటెస్ట్ టెక్నాలజీ యాంబియంట్ నాయిస్ రాకుండా అడ్డుకుంటుంది. చక్కటి మ్యూజిక్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది. చక్కటి లుక్, అంతకు మించిన మ్యూజిక్ అనుభూతిని కలిగిస్తుంది. దీని ధర రూ. రూ.1999
3. VingaJoy CL-1340 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్
బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్ బ్యాండ్ లో VingaJoy CL-1340 ఒకటి. ఒకే ఛార్జ్ తో 25 గంటల ప్లే టైమ్ లభిస్తుంది. చక్కటి ఆడియో క్వాలిటీతో వీనుల విందైన మ్యూజిక్ ఆనందించే అవకాశం ఉంటుంది. దీని ధర రూ. 1499.
4. రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2ఎస్
రియల్‌మే బడ్స్ వైర్‌లెస్ 2S చక్కటి మ్యూజిక్ ను అందిస్తుంది. తేలికైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీని కలిగి ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్‌ను కూడా కలిగి ఉంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఫిల్టర్ చేస్తూ చక్కటి మ్యూజిక్ ను అందించేలా చేస్తుంది.
5. OnePlus బుల్లెట్లు Z2
మంచి సౌండ్ క్వాలిటీ అందించడంలో ముందుంటుంది OnePlus Bullets Z2 నెక్‌బ్యాండ్. లేటెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో అద్భుతమైన ఆడియోను అందిస్తుంది. బ్లూటూత్ 5.2 కనెక్టివిటీని కలిగి ఉంటుంది. మంచి క్వాలిటీ డ్రైవర్లు చక్కటి సౌండ్ ను అదిస్తాయి. దీని ధర రూ. 1791గా కంపెనీ నిర్ణయించింది. మదర్స్ డే రోజును ఈ ఐదింటిలో ఏదో ఒకటి బహుమతిగా ఇచ్చి అమ్మను సంతోషపెట్టండి.
Happy Mothers Day 2024
Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)