అన్వేషించండి

Sony Wearable AC: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!

వేసవిలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ చల్లటి వార్తను చెప్పింది. మెడ భాగంలో ధరించి ఎక్కడికైనా తీసుకెళ్లే సరికొత్త ఏసీ డివైజ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Sony Wearable AC: ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనీ కంపెనీ, సరికొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. వేసవిలో ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం మరో స్మార్ట్ గాడ్జెట్ ను విడుదల చేసింది. ఇంకా చెప్పాలంటే, మెడ వెనుక భాగంలో ధరించే చిన్న ఏసీని అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడికైనా దీనిని ఈజీగా తీసుకెళ్లేలా రూపొందించింది. చలికాలంలో వేడి, ఎండాకాలంలో చల్లదనాన్ని కలిగించేలా దీనిని రూపొందించింది. రియాన్ పాకెట్-5 పేరుతో ఈ డివైజ్ ను మార్కెట్లోకి తెస్తోంది.   

రియాన్‌ పాకెట్‌ 5 డివైజ్ ఎలా పని చేస్తుందంటే?

రియాన్‌ పాకెట్‌ 5 డివైజ్ పరిసరాల ఉష్ణోగ్రత ఆధారంగా పని చేస్తుంది. ఈ డివైజ్ ను ఆన్ చేసి మెడ వెనుక భాగంలో ధరించగానే, ముందుగా బాడీ టెంపరేచర్ ను అంచనా వేస్తుంది. ఆ తర్వాత వాతావరణంలోని ఉష్ణోగ్రత స్థాయిని గుర్తిస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే శరీరానికి అవసరమైన వేడిని అందిస్తుంది. ఈ డివైజ్ ను వినియోగదారులు ప్రత్యేకంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. తనంతట తానే పని చేస్తుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా టెంపరేచర్ ను సెట్ చేస్తుంది. ఒకవేళ అసవరం అనుకుంటే మొబైల్ యాప్ ద్వారా స్పెషల్ గా కమాండ్స్ ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ తో పాటు ఐఫోన్ల ద్వారా ఈ యాప్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ప్రత్యేకంగా ఆన్, ఆఫ్ చేయాల్సిన పని లేదు!

ఇంకా చెప్పాలంటే రియాన్‌ పాకెట్‌ 5 డివైజ్ ను ప్రత్యేకంగా ఆన్, ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మెడ భాగంలో ధరించగానే ఆటోమేటిక్ గా పని చేయడం ప్రారంభిస్తుంది. మళ్లీ తీయగానే ఆగిపోతుంది. ఇక వాతావరణ పరిస్థితులను అంటే వేడి, తేమను గుర్తించడానికి ఇందులో ప్రత్యేకంగా సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఈ డివైజ్ లో మొత్తం ఆయా పరిస్థితులను అంచనా వేసేందుకు 5 సెన్సార్లు ఉంటాయి. వీటికి తోడుగా ఒక ప్యాకెట్ ట్యాగ్ కూడా ఉంటుంది. దీనిని షర్ట్ పాకెట్ లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్యాగ్ వాతావరణంలోని టెంపరేచర్ ను గుర్తించి రియాన్ పాకెట్ డివైజ్ కు అందిస్తుంది. అయితే, ఈ ట్యాగ్ లేకున్నా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ పాకెట్ ట్యాగ్ అనేది కచ్చితమైన టెంపరేచర్ ను అంచనా వేయడంలో సాయపడుతుందని తెలిపింది.  

బ్యాటరీ లైఫ్ ఎన్ని గంటలు? ధర ఎంత అంటే?

ఇక ఈ రియాన్ పాకెట్ డివైజ్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే సుమారు 17 గంటల పాటు పని చేస్తుంది. ఈ డివైజ్ ధర 170 అమెరికన్ డాలర్లు. అంటే, భారత కరెన్సీలో సుమారు రూ. 14,186. ప్రస్తుతం ఈ డివైజ్ భారత మార్కెట్లో అందుబాటులో లేదు. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. వాస్తవానికి ఈ డివైజ్ 2019లోనే మార్కెట్లోకి తీసుకొచ్చింది. నెమ్మదిగా ఈ డివైజ్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తెలుస్తోంది. ప్రస్తుతం రియాన్ పాకెట్ 5 డివైజ్ ను యూరప్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ లో మే నుంచి అందుబాటులోకి రానుంది. మలేషియా, థాయ్ లాండ్, వియత్నాం మార్కెట్లలోకి కూడా త్వరలో పరిచయం చేయనుంది.  

Read Also: వావ్ అనిపించే ఏఐ టూల్‌ని తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ - ఒరిజినల్ అనిపించే ఫేక్ వీడియోలతో!

టాప్ హెడ్ లైన్స్

Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget