Daiwa 4K UHD Smart TV: కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్.. 43, 55 అంగుళాల సైజుల్లో.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ దైవా తన కొత్త స్మార్ట్ టీవీలను మనదేశంలో లాంచ్ చేసింది. 43 అంగుళాలు, 55 అంగుళాల సైజుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
దైవా 4కే యూహెచ్‌డీ స్మార్ట్ టీవీలు మనదేశంలో లాంచ్ అయ్యాయి. 43 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. ఎల్జీ వెబ్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ టీవీలు పనిచేయనున్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్‌గా థింక్ ఏఐ వాయిస్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. అంచులు లేని డిజైన్‌ను ఇందులో అందించనున్నారు. మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపన్సేషన్ సపోర్ట్, హెచ్‌డీఆర్10 సపోర్ట్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన దైవా స్మార్ట్ టీవీల్లో మ్యాజిక్ రిమోట్‌ను కూడా అందించనున్నారు.
దైవా 4కే యూహెచ్‌డీ స్మార్ట్ టీవీ D43U1WOS, D55U1WOS ధరలు
ఇందులో 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.34,999గానూ, 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.49,999గానూ ఉంది. ఈ కొత్త స్మార్ట్ టీవీలు ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులకు ఒక సంవత్సరం పూర్తి వారంటీ, ఒక సంవత్సరం ప్యానెల్ వారంటీ లభించనున్నాయి.
దైవా 4కే యూహెచ్‌డీ స్మార్ట్ టీవీల స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ టీవీలు 43 అంగుళాలు, 55 అంగుళాల మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. 107 కోట్ల రంగులను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 96 శాతంగా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, క్వాంటం లుమినిట్+ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేయనుంది.
ఈ కొత్త టీవీల్లో ఎల్జీ వెబ్ఓఎస్ టీవీ, థింక్ ఏఐ వాయిస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఏఐ క్వాడ్ కోర్ ప్రాసెసర్లు ఇందులో అందించారు. 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ, ఎంఈఎంసీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఏఎల్ఎల్ఎం సపోర్ట్, ఇన్‌బిల్ట్ అలెక్సా ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఆడియో విషయానికి వస్తే.. వీటిలో 20W సరౌండ్ సౌండ్ బాక్స్ స్పీకర్లు ఉండనున్నాయి. డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. మిరాకాస్ట్ ఆప్షన్ కూడా ఉంది.
ఎల్జీ స్మార్ట్ టీవీలతో అందించే మ్యాజిక్ రిమోట్‌ను ఈ కొత్త దైవా టీవీలతో అందించనున్నారు. ఎయిర్ మౌస్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. పర్సనలైజ్డ్ పిక్చర్, సౌండ్ సెట్టింగ్స్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. దీని మందం 0.87 సెంటీమీటర్లుగానూ, బరువు 7.5 కేజీలుగా ఉంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!