Mahendra Singh Dhoni: ధోనికి గాయం అయితే నడిపించేది ఎవరు? చెన్నై తర్వాతి కెప్టెన్ ఫిక్స్ కాలేదా?
ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనికి గాయం అయితే చెన్నైని ఎవరు నడిపిస్తారు?
MS Dhoni Injury Update: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో చివరి బంతికి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ చేతితో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా ఓటమి చవి చూసింది.
అయితే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఏప్రిల్ 17వ తేదీన ముఖాముఖి తలపడనున్నాయి. బెంగుళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఒక చేదు వార్త. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడగలడా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు.
మహేంద్ర సింగ్ ధోని స్థానంలో సీఎస్‌కే కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు గాయపడడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడలేకపోతే జట్టును ఎవరు నడిపిస్తారు? నిజానికి బెన్ స్టోక్స్ కూడా గాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారని అన్నారు.
మహేంద్ర సింగ్ ధోనీతో పాటు జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయంతో బాధపడుతున్నారని చెప్పాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ రాబోయే మ్యాచ్‌లలో కనిపిస్తాడా లేదా అనే దానిపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారా?
మహేంద్ర సింగ్ ధోనీతో పాటు దీపక్ చాహర్, సిసంద మగల, సిమ్రన్‌జిత్ సింగ్ వంటి ఆటగాళ్లు గాయపడ్డారు. అయితే కెప్టెన్ కూల్ గైర్హాజరీలో జట్టును ఎవరు నడిపిస్తారన్నది అతి పెద్ద ప్రశ్న? నిజానికి మహేంద్ర సింగ్ ధోనీ ఆడకపోతే రుతురాజ్ గైక్వాడ్ లేదా బెన్ స్టోక్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండవచ్చని తెలుస్తోంది. బెన్ స్టోక్స్ కూడా గాయపడ్డాడని ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మొయిన్ అలీ చెప్పాడు. అయితే ఈ పరిస్థితిలో మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఏ ఆటగాడిని కెప్టెన్‌గా ఎంచుకుంటుందో కాలమే నిర్ణయించాలి.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో అతని బ్యాట్ నుంచి సిక్సర్ల వర్షం కురుస్తుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని అత్యుత్తమ ఇన్నింగ్స్‌ని ప్రదర్శించాడు. అతను 17 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో పాటు ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో 100 సిక్సర్లు కూడా పూర్తి చేశాడు. దీంతో పాటు టోర్నీ 20వ ఓవర్లో బ్యాటింగ్ విషయంలో ధోనీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్‌లో 20వ ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీనే. టోర్నీలో ఇప్పటి వరకు, 20వ ఓవర్లో అతని బ్యాట్ నుండి మొత్తం 57 సిక్సర్లు వచ్చాయి. ఈ జాబితాలో కీరన్ పొలార్డ్ 33 సిక్సర్లతో రెండో స్థానంలో, రవీంద్ర జడేజా 26 సిక్సర్లతో మూడో స్థానంలో, హార్దిక్ పాండ్యా 25 సిక్సర్లతో నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ 23 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.