IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు రేపటి నుంచి వాంఖడే స్టేడియంలో జరగనుంది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 3వ తేదీ నుంచి జరగనుంది. వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మొదటి టెస్టు ఐదో రోజున న్యూజిలాండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ మ్యాచ్ ఫలితం డ్రాగానే ముగిసింది.
మొదటి టెస్టులో రెండు జట్లూ విజయం కోసం పోరాడాయి. న్యూజిలాండ్ 2020 జనవరి తర్వాత టెస్టుల్లో ఇంతవరకు ఓటమి పాలేదు. ఇండియా(టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్), పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లపై న్యూజిలాండ్ విజయం సాధించగా.. భారత్(మొదటి టెస్టు), ఇంగ్లండ్‌లతో జరిగిన మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. 2020 ఫిబ్రవరిలో భారత్‌పై విజయంతో న్యూజిలాండ్ విజయ పరంపర మొదలైంది.
భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుందని తెలిసింది. సీమర్లకు అదనపు పేస్, బౌన్స్ లభించనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లేదా హాట్‌స్టార్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్ చూడవచ్చు.
మొదటి మ్యాచ్‌లో టిమ్ సౌతీకి గాయం అయింది కాబట్టి ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో తెలియాల్సి ఉంది. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం తుదిజట్టులో మార్పులు చేయాలని అనుకోవట్లేదు. ఒకవేళ టిమ్ సౌతీ జట్టుకు దూరమైతే మాత్రం నీల్ వాగ్నర్‌కు చాన్స్ రావచ్చు.
ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు దూరమైన కింగ్ కోహ్లీ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. కోహ్లీ స్థానంలో ఎవరిని పక్కన పెడతారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీంతోపాటు తెలుగు తేజం కేఎస్ భరత్‌కు తొలి అవకాశం దక్కనుందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్‌ల్లో ఒకరు బెంచ్‌కి పరిమితం కాక తప్పేలా లేదు.
భారత్ తుదిజట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్/అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా/కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్
న్యూజిలాండ్ తుదిజట్టు(అంచనా)
టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ/నీల్ వాగ్నర్, అజాజ్ పటేల్, విలియమ్ సోమర్ విల్లే
Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు
Also Read: IPL Highest Paid Players: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్ తాజా కోటీశ్వరులు వీరే
Also Read: Neeraj Chopra: మోదీ చెప్పారు.. నీరజ్ మొదలు పెట్టాడు..! ఏంటా మిషన్..? ఎందుకు..?
Also Read: IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?
Also Read: IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి