అన్వేషించండి

IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడి పునరాగమనంతో ఎవరిని తీసేయాలో అర్థం కావడం లేదు. దాంతో జట్టు యాజమాన్యానికి ఇదో సమస్యగా మారింది.

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా తలనొప్పి మొదలైంది! కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులోకి ప్రవేశించాడు. దాంతో తుది జట్టులో ఎవరిని తొలగించాలో జట్టు యాజమాన్యానికి అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని బౌలింగ్‌ కోచ్‌ పరాస్ మహంబ్రేని అడిగితే జట్టుకున్న వనరులకు ఇదో ఉదాహరణగా వర్ణించాడు.

ఏడు నెలలుగా ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కివీస్‌తో టీ20 సిరీసు, తొలి టెస్టుకు దూరంగా ఉన్నాడు. ముంబయిలో జరిగే రెండో టెస్టుకు అతడు జట్టులోకి వచ్చేశాడు. దాంతో ఎవరిని జట్టులోంచి పక్కన పెట్టాలో అర్థం కావడం లేదు. కొత్త కుర్రాడు శ్రేయస్‌ను తీసేద్దామంటే అరంగేట్రంలో టెస్టులో వరుసగా శతకం, అర్ధశతకం చేసి ఆకట్టుకున్నాడు. రహానె, పుజారా ఫామ్‌లో లేరు కానీ.. వారిద్దరూ జట్టుకు కీలకమే. మరి ఏం చేస్తారన్నది ఆసక్తికరం.

'ఈ సమస్య మంచిదే! మా వద్ద ఎంతో మంది నైపుణ్యాలున్న ఆటగాళ్లు ఉన్నారు. ఇది భారత క్రికెట్‌ స్థితిని తెలియజేస్తోంది. వచ్చిన కుర్రాళ్లకు మేం అవకాశాలు ఇవ్వాలనే అనుకుంటున్నాం. శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చి వరుసగా శతకం, అర్ధశతకం చేయడం అద్భుతం. కానీ కొన్నిసార్లు మనం సమతూకం, పరిస్థితులు, వికెట్‌ను బట్టి కూర్పు ఉంటుంది' అని పరాస్‌ మహంబ్రే అంటున్నాడు.

అజింక్య రహానె ఫామ్‌లో లేడు. పుజారాకు మంచి ఆరంభాలే వచ్చినా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. 'వారిద్దరి వెనక ఎంతో అనుభవం ఉందని మనకి తెలుసు. వారిప్పటికే చాలా క్రికెట్‌ ఆడారు. వారు ఫామ్‌లోకి రావడానికి ఒక ఇన్నింగ్స్‌ చాలు. ఒక జట్టుగా మేం వారికి అండగా ఉంటాం. జట్టుకు వారు తీసుకొచ్చే విలువ అందరికీ తెలుసు' అని మహంబ్రే వెల్లడించాడు.

Also Read: David Warner Tweet: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై.. ఛాప్టర్ క్లోజ్ అంటూ ట్వీట్.. SRH ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు 

Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు

Also Read: SRH Retention 2022: కథ మళ్లీ మొదటికే.. ‘0’ నుంచి షురూ చేయాల్సిందే కేన్ మామా!

Also Read: IPL Retention 2022: ఐపీఎల్ 2022 రిటెన్షన్ లిస్ట్ ఇదే.. ఏయే జట్లలో ఎవరున్నారు.. రైజర్స్ ఎంచుకున్న ముగ్గురు ఎవరు?

Also Read: IPL Retention: ధోనీ లేని చెన్నై..! మహీని తీసుకోవద్దంటూ గంభీర్‌ సూచన!

Also Read: WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget