David Warner Tweet: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై.. ఛాప్టర్ క్లోజ్ అంటూ ట్వీట్.. SRH ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు
IPL 2022 Retention: ఐపీఎల్ 2021లో చివరి మ్యాచ్‌లలో జట్టుకు దూరం కావడంతో వార్నర్ ను ఫ్రాంచైజీ దూరం చేసుకుంటుందని వినిపించింది. నిన్న దీనిపై సన్‌రైజన్స్ ఫ్యాన్స్‌కు క్లారిటీ వచ్చింది.
David Warner Tweet: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)కు గానూ ఫ్రాంచైజీలు తాము రీటెయిన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. కీలక ఆటగాడు, ఆసీస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2021లో చివరి మ్యాచ్‌లలో జట్టుకు దూరం కావడంతో వార్నర్ ను ఫ్రాంచైజీ దూరం చేసుకుంటుందని వినిపించింది. ఆపై వార్నర్ సన్‌రైజర్స్‌ను వీడుతున్నాడని ప్రచారం సైతం జరిగింది. నిన్న దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు అన్ క్యాప్డ్ ప్లేయర్స్ అబ్దుల్ సమద్, ఉమ్రన్ మలిక్‌లను రీటెయిన్ చేసుకుంది. వార్నర్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్‌కు దండం పెట్టేశాడు. రీటెయిన్ జాబితా రీలీజయ్యాక ఛాప్టర్ క్లోజ్‌డ్ అని అధికారికంగా స్పందించాడు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుకు విశేష స్పందన లభిస్తోంది. తనకు ఏళ్ల తరబడి మద్దతు తెలిపిన సన్ రైజర్స్ అభిమానులకు, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు. తనపై ఎంతో ప్రేమగా, నిజాయితీగా అభిమానులు ఉన్నారంటూ పాత మేనేజ్‌మెంట్‌కు చురకలు అంటించాడు.
Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు
Chapter closed!! Thanks to all of the fans @srhfansofficial @sunrisersfansofficial for your support over all the years, it was was much appreciated. #fans #loyal https://t.co/P13ztBcBQH
— David Warner (@davidwarner31) December 1, 2021
ఇష్టం లేక తప్పుకున్నాడా!
గత కొన్నేళ్లుగా ఎస్‌ఆర్‌హెచ్ పేరు చెబితే మనకు వెంటనే గుర్తొచ్చేది డేవిడ్ వార్నర్. అతడి ప్రదర్శనతోనే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. కప్పు కూడా కొట్టింది. కానీ గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోవడం తనకు అవమానంగా భావించాడు. ఆపై జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆసీస్ జట్టును విజేతగా నిలపడంతో తన వంతు పాత్ర పోషించాడు వార్నర్. తమ తప్పును గుర్తించిన సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్ వార్నర్‌ను జట్టులోకి తీసుకోవాలని, రీటెయిన్ చేసుకోవాలని భావించినా అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో తాజాగా వేలంలోకి వచ్చిన వార్నర్‌కు ఐపీఎల్ 2022లో భారీ డిమాండ్ రానుంది. వచ్చే జనవరిలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. విదేశీ క్రికెటర్లలో భారీ ధర పలికే ఆటగాళ్లలో తప్పకుండా వార్నర్ ఉంటాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.
Also Read: SRH Retention 2022: కథ మళ్లీ మొదటికే.. ‘0’ నుంచి షురూ చేయాల్సిందే కేన్ మామా!
View this post on Instagram
Also Read: ఐపీఎల్ 2022 వేలంలో ఈ 10 ఇండియన్ ప్లేయర్లకు డిమాండ్