X

SRH Retention 2022: కథ మళ్లీ మొదటికే.. ‘0’ నుంచి షురూ చేయాల్సిందే కేన్ మామా!

ఐపీఎల్‌లో సన్‌‌రైజర్స్ జట్టు ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వీరు ఎవరంటే?

FOLLOW US: 

ఐపీఎల్‌లో మరో కీలక ఘట్టం ముగిసింది. ఆటగాళ్ల రిటెన్షన్‌కు, దానికి సంబంధించిన సంప్రదింపులకు బీసీసీఐ ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో జట్లు తాము రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను వెల్లడించారు. ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. కథను సన్‌రైజర్స్ మళ్లీ మొదటికి తీసుకువచ్చింది. జట్టును మళ్లీ 0 నుంచి నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది.

అవును.. రైజర్స్ బృందం కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రన్ మలిక్‌లను మాత్రమే రిటైన్ చేసింది. సరిగ్గా సంవత్సరం ముందు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్, నబీ, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో వెలిగిపోయిన్ సన్‌రైజర్స్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వయంకృతాపరాధమా? ఆటగాళ్ల నిర్ణయాలు కారణమా?

ఇక్కడ మొదట చెప్పుకోవాల్సింది డేవిడ్ వార్నర్ గురించి. వార్నర్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే వార్నర్.. అనే పరిస్థితి నుంచి ‘మీకో దండం నాయనా’ అని వార్నర్ అనేలా చేసుకోవడానికి కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రవర్తనే కారణం. ఒక్క సీజన్ కూడా కాదు... కేవలం ఏడు మ్యాచ్‌ల వైఫల్యానికే వార్నర్‌ను బాధ్యుడిని చేసి కెప్టెన్సీ నుంచి తప్పించడం, జట్టులో ఆటగాడిగా కూడా స్థానం ఇవ్వకపోవడం వంటివి వార్నర్‌ను బాధించాయి. దీంతో వార్నర్ రైజర్స్‌ను వదలడానికి నిర్ణయించుకున్నాడు.

ఇక రషీద్ ఖాన్‌ది మరో కథ. రషీద్ ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు మొదటి రిటెన్షన్‌గా ఉండాలనుకున్నాడు. మొదటి రిటెన్షన్ ఆటగాడికి రూ.16 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ రూ.14 కోట్లు చెల్లించి కేన్ విలియమ్సన్‌ను మొదటి రిటెన్షన్‌గా ఉంచుకోవడానికి మొగ్గు చూపింది. దీంతో రషీద్ కూడా వెళ్లిపోయాడు.

జానీ బెయిర్‌స్టోని స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా ఉంచుకునే అవకాశం ఉంది. కానీ రైజర్స్ ఎందుకో ఆ ప్రయత్నం చేయలేదు. బహుశా నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ల్లో ఒకరిని వేలంలో కొనుగోలు చేసే ఆలోచనలో ఉందేమో తెలియాల్సి ఉంది. భువనేశ్వర్ తరచుగా గాయాల పాలవుతూ ఉండటం, ఇటీవల అంత ప్రభావం చూపకపోవడంతో తనని కూడా రైజర్స్ యాజమాన్యం పరిగణనలోకి తీసుకోలేదు.

ఇప్పుడు సన్‌రైజర్స్ ముందు చాలా పెద్ద టాస్కే ఉంది. జట్టును మళ్లీ బిల్డ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రస్తుతం రైజర్స్ దగ్గర వేలంలో ఖర్చు పెట్టడానికి ఏకంగా రూ.68 కోట్లు ఉన్నాయి. గత వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకుని ఈసారి అయినా వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రైజర్స్ దగ్గర మంచి కెప్టెన్ ఉన్నాడు. అతని చేతిలో సరైన టీంను పెట్టి.. జట్టు వ్యూహాల్లో భాగస్వామిని చేస్తే.. మళ్లీ పునర్‌వైభవం పొందవచ్చు.

Also Read: ఐపీఎల్ 2022 రిటెన్షన్ లిస్ట్ ఇదే.. ఏయే జట్లలో ఎవరున్నారు.. రైజర్స్ ఎంచుకున్న ముగ్గురు ఎవరు?

Also Read: Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్‌

Also Read: Ahmedabad Franchise: అహ్మదాబాద్.. ఇలా అయితే ఎలా.. ఐపీఎల్ 2022లో కష్టమే!

Also Read: CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?

Also Read: WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Kane Williamson Umran Malik సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL Retention 2022 Sunrisers Retentions SRH IPL Retention 2022 SRH Retention 2022 SRH Retained Players SRH Retained Players 2022 Abdul Samad ఐపీఎల్ రిటెన్షన్ 2022

సంబంధిత కథనాలు

IND vs WI: విండీస్‌ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్‌ ఫిట్‌నెస్‌ టెస్టు సంగతేంటి?

IND vs WI: విండీస్‌ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్‌ ఫిట్‌నెస్‌ టెస్టు సంగతేంటి?

Republic Day 2022: ఒలింపిక్‌ హీరోల 'జన గణ మన'..! రోమాలు నిక్కబొడవకుండా ఉండగలవా!!

Republic Day 2022: ఒలింపిక్‌ హీరోల 'జన గణ మన'..! రోమాలు నిక్కబొడవకుండా ఉండగలవా!!

Republic Day Awards 2022: సరిలేరు నీకెవ్వరూ!! నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

Republic Day Awards 2022: సరిలేరు నీకెవ్వరూ!! నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 

Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 

KL Rahul Captaincy: నా కెప్టెన్సీ పైనే విమర్శలా? రాహుల్‌ జవాబు ఇదిగో!!

KL Rahul Captaincy: నా కెప్టెన్సీ పైనే విమర్శలా? రాహుల్‌ జవాబు ఇదిగో!!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Dasara: నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?

Dasara: నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?

AP BJP : తప్పు జగన్‌ది కాదు ఆయన దగ్గర చేరిన ముఠాదే ... రివర్స్ నిర్ణయాలపై ఏపీ బీజేపీ ఘాటు విమర్శలు !

AP BJP :  తప్పు జగన్‌ది కాదు ఆయన దగ్గర చేరిన ముఠాదే ... రివర్స్ నిర్ణయాలపై ఏపీ బీజేపీ ఘాటు విమర్శలు !

Union Budget 2022: నిత్యావసర ధరలకు కళ్లెం, సొంత కాళ్లపై నిలబడేలా సాయం.. నిర్మలమ్మ నుంచి ఈ సారి మహిళలు కోరుకుంటున్నది ఇదే !

Union Budget 2022: నిత్యావసర ధరలకు కళ్లెం, సొంత కాళ్లపై నిలబడేలా సాయం.. నిర్మలమ్మ నుంచి ఈ సారి మహిళలు కోరుకుంటున్నది ఇదే !

Mango Ram - Sunitha: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి

Mango Ram - Sunitha: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి