X

CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?

ఐపీఎల్ 2021 చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వచ్చే సీజన్ నుంచి కొత్త స్పాన్సర్ ఉండనుంది. టీవీఎస్ యూరోగ్రిప్‌తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది.

FOLLOW US: 

ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు టీవీఎస్ యూరోగ్రిప్, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైకి ప్రధాన స్పాన్సర్‌గా టీవీఎస్ యూరోగ్రిప్ వ్యవహరించనుంది. 2022 నుంచి 2024 వరకు మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది.

ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి ఐపీఎల్ 2021 ట్రోఫీని సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ను ఉపయోగించుకోవడానికి టీవీఎస్ యూరోగ్రిప్, సీఎస్‌కే యాజమాన్యంతో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి.

యూరోగ్రిప్ బ్రాండ్ నేమ్ అందరికీ తెలిసేలా చేసేందుకు జెర్సీ బ్రాండింగ్, స్పాన్సర్‌షిప్ ఉపయోగపడతాయని టీవీఎస్ శ్రీచక్ర సేల్స్, మార్కెటింగ్‌కు ఈవీపీగా వ్యవహరించే పి.మాధవన్ అన్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు.

‘చెన్నై సూపర్‌కింగ్స్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకున్నందుకు సంతోషిస్తున్నాం. మా వినియోగదారులకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఎదురు చూస్తున్నాం. ఈ భాగస్వామ్యం చెన్నై సూపర్ కింగ్స్, టీవీఎస్ యూరోగ్రిప్ రెండిటికీ ఎంతో మేలు చేస్తాయని నమ్మకంతో ఉన్నాం.’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ లిమిటెడ్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యాన్స్‌తో అనుబంధాన్ని మరింత పెంచేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘టీవీఎస్ యూరోగ్రిప్‌ను ప్రధాన స్పాన్సర్‌గా ప్రకటించడం ఆనందంగా ఉంది. సూపర్ కింగ్స్ కుటుంబానికి వారికి స్వాగతం.’ అన్నారు.

Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!

Also Read: IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ

Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్‌ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్‌

Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?

Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: MS Dhoni Chennai super kings IPL 2022 చెన్నై సూపర్ కింగ్స్ CSK New Sponsor TVS Eurogrip CSK in IPL TVS Eurogrip For CSK ఐపీఎల్ 2022

సంబంధిత కథనాలు

IND vs WI: విండీస్‌ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్‌ ఫిట్‌నెస్‌ టెస్టు సంగతేంటి?

IND vs WI: విండీస్‌ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్‌ ఫిట్‌నెస్‌ టెస్టు సంగతేంటి?

Republic Day 2022: ఒలింపిక్‌ హీరోల 'జన గణ మన'..! రోమాలు నిక్కబొడవకుండా ఉండగలవా!!

Republic Day 2022: ఒలింపిక్‌ హీరోల 'జన గణ మన'..! రోమాలు నిక్కబొడవకుండా ఉండగలవా!!

Republic Day Awards 2022: సరిలేరు నీకెవ్వరూ!! నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

Republic Day Awards 2022: సరిలేరు నీకెవ్వరూ!! నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 

Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 

KL Rahul Captaincy: నా కెప్టెన్సీ పైనే విమర్శలా? రాహుల్‌ జవాబు ఇదిగో!!

KL Rahul Captaincy: నా కెప్టెన్సీ పైనే విమర్శలా? రాహుల్‌ జవాబు ఇదిగో!!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP BJP : తప్పు జగన్‌ది కాదు ఆయన దగ్గర చేరిన ముఠాదే ... రివర్స్ నిర్ణయాలపై ఏపీ బీజేపీ ఘాటు విమర్శలు !

AP BJP :  తప్పు జగన్‌ది కాదు ఆయన దగ్గర చేరిన ముఠాదే ... రివర్స్ నిర్ణయాలపై ఏపీ బీజేపీ ఘాటు విమర్శలు !

Mango Ram - Sunitha: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి

Mango Ram - Sunitha: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి

Bread in Fridge: బ్రెడ్‌‌ను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?

Bread in Fridge: బ్రెడ్‌‌ను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?

Lahari: రూ.5 లక్షల విలువైన బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ..

Lahari: రూ.5 లక్షల విలువైన బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ..