X

IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!

భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. చివర్లో న్యూజిలాండ్ టెయిలెండర్లు అసమాన పోరాటపటిమ కనపరిచారు.

FOLLOW US: 

భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 4/1 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పరుగులకు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టామ్ లాథమ్ (52: 146 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

284 పరుగుల లక్ష్యంతో బరిలోకి న్యూజిలాండ్ నాలుగో రోజు చివర్లో మొదటి వికెట్ కోల్పోయింది. అయితే ఐదోరోజును ఆ జట్టు మెరుగ్గానే ప్రారంభించింది. మొదటి  ఓపెనర్ టామ్ లాథమ్, వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్ సోమర్‌విల్లే (36: 110 బంతుల్లో, ఐదు ఫోర్లు) వికెట్ ఇవ్వకుండా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించారు.

రెండో సెషన్ మొదటి బంతికే విలియమ్‌ను అవుట్ చేసి ఉమేశ్ యాదవ్ భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. రాస్ టేలర్ (2: 24 బంతుల్లో), హెన్రీ నికోల్స్ (1: 4 బంతుల్లో), టామ్ బ్లండెల్ (2: 38 బంతుల్లో) విఫలం అయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (24: 112 బంతుల్లో, మూడు ఫోర్లు) భారత బౌలర్లను కాసేపు అడ్డుకున్నాడు. అయితే తను కూడా ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. చివర్లో భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర (18 నాటౌట్: 91 బంతుల్లో, రెండు ఫోర్లు), 11వ నంబర్ ఆటగాడు అజాజ్ పటేల్ (2 నాటౌట్: 23 బంతుల్లో) తొమ్మిది ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకుని.. మ్యాచ్ డ్రాగా ముగించారు.

మ్యాచ్ చివరి రోజు స్పిన్నర్లు పూర్తిగా డామినేట్ చేశారు. కివీస్ నాలుగో ఇన్నింగ్స్‌లో కోల్పోయిన మొత్తం తొమ్మిది వికెట్లలో ఒక వికెట్ మాత్రమే పేసర్‌కు దక్కింది. మిగిలిన తొమ్మిది వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 3వ తేదీ నుంచి జరగనుంది.

Also Read: IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ

Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్‌ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్‌

Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?

Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: India India VS New Zealand New Zealand ajinkya rahane Kane Williamson Ind Vs NZ IND vs NZ 1st Test ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

సంబంధిత కథనాలు

IND vs SA, 1st innings highlights: బాబోయ్‌.. బవుమా!  దంచేసిన.. డుసెన్‌! టీమ్‌ఇండియా లక్ష్యం 297

IND vs SA, 1st innings highlights: బాబోయ్‌.. బవుమా! దంచేసిన.. డుసెన్‌! టీమ్‌ఇండియా లక్ష్యం 297

Glenn Maxwell: మెల్‌బోర్న్‌లో మాక్స్‌వెల్ అరాచకం.. బౌండరీలతోనే ఏకంగా 112 పరుగులు.. ఆర్సీబీ రికార్డు మూడో స్థానానికి.. అయినా హ్యాపీనే!

Glenn Maxwell: మెల్‌బోర్న్‌లో మాక్స్‌వెల్ అరాచకం.. బౌండరీలతోనే ఏకంగా 112 పరుగులు.. ఆర్సీబీ రికార్డు మూడో స్థానానికి.. అయినా హ్యాపీనే!

Sania Mirza Retirement: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై! 2022 సీజన్‌ ముగిశాకే!!

Sania Mirza Retirement: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై! 2022  సీజన్‌ ముగిశాకే!!

India Tour of SA: రహానె, పుజారాకు షాక్‌! తలుపులు మూసేస్తున్న సెలక్షన్‌ కమిటీ?

India Tour of SA: రహానె, పుజారాకు షాక్‌! తలుపులు మూసేస్తున్న సెలక్షన్‌ కమిటీ?

IND vs SA 1st ODI: వెంకటేశ్‌ అయ్యర్‌ అరంగేట్రం! ప్చ్‌..! ధోనీ శిష్యుడికి తప్పని ఎదురుచూపులు!!

IND vs SA 1st ODI: వెంకటేశ్‌ అయ్యర్‌ అరంగేట్రం! ప్చ్‌..! ధోనీ శిష్యుడికి తప్పని ఎదురుచూపులు!!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

Health News: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి

Health News: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి

Lessons from Test series vs SA: భారత టెస్టు సెటప్ లో ఏ మార్పులు కావాలి? | Cricket | India | Kohli

Lessons from Test series vs SA: భారత టెస్టు సెటప్ లో ఏ మార్పులు కావాలి? | Cricket | India | Kohli