X

IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ

రవిచంద్రన్‌ అశ్విన్‌పై డేనియెల్‌ వెటోరీ ప్రశంసలు కురిపించాడు. కాన్పూర్‌ పిచ్‌పై అతడు చూపిన వైవిధ్యం అద్భుతమని పేర్కొన్నాడు. కఠినతరమైన పిచ్‌లపై మరే స్పిన్నర్‌ ఇంతలా కష్టపడలేడని వెల్లడించాడు.

FOLLOW US: 

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై కివీస్‌ మాజీ ఆటగాడు డేనియెల్‌ వెటోరీ ప్రశంసలు కురిపించాడు. కాన్పూర్‌ పిచ్‌పై అతడు చూపిన వైవిధ్యం అద్భుతమని పేర్కొన్నాడు. ఇలాంటి కఠినతరమైన పిచ్‌లపై మరే స్పిన్నర్‌ ఇంతలా కష్టపడలేడని వెల్లడించాడు. భారత్‌, కివీస్‌ తొలి టెస్టు మూడో రోజు తర్వాత అతడు మాట్లాడాడు.

కివీస్‌ ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఏకంగా 42.3 ఓవర్లు విసిరాడు. అందులో 10 మెయిడిన్‌ వేశాడు. 82 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్‌ పటేల్‌ ఐదు వికెట్లు తీసినప్పటికీ అతడికి మరో ఎండ్‌లో యాష్‌ అండగా నిలిచాడు. కివీస్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కష్టతరమైన పిచ్‌పై విలువైన బంతులు వేశాడు. అందుకే వెటోరీ అతడిపై ప్రశంసలు కురిపించాడు.

'ఇలాంటి పరిస్థితులను అశ్విన్‌ ఇష్టపడతాడు. బౌండరీలను పరీక్షించాలని అనుకుంటాడు. ఒక బౌలర్‌గా ఏమి ఇవ్వగలనని ఆలోచిస్తాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై కుదురుకోగానే లయ అందుకుంటాడు. సరైన లెంగ్తుల్లో బంతులు వేస్తుంటాడు. తనలోని వైవిధ్యం, నైపుణ్యాలను చాలా రకాలుగా చూపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతడి బౌలింగ్‌ను చూడటం చాలా బాగుంది. అతడు బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టేశాడు' అని వెటోరీ అన్నాడు.

'అశ్విన్‌ బౌలింగ్‌ను నేను ఆస్వాదించాను. ఎందుకంటే స్పిన్నర్‌ నుంచి ఇలాంటి ఎప్పుడూ చూడలేం. ఇలాంటి పిచ్‌పై ఇంతలా ఒక స్పిన్నర్‌ ప్రయత్నించడం నేనెప్పుడూ చూడలేదు. అందుకే అతడికి ఫలితాలు రావడం కనిపించింది. పైగా అతడు కొందరు బ్యాటర్ల బుర్రల్లో సందేహాలు సృష్టించాడు. వాళ్లెప్పుడూ గార్డ్‌ మీదే ఉన్నారు. ఒక స్పిన్నర్‌కు ఇదే అత్యుత్తమ పరిస్థితి' అని వెటోరీ వివరించాడు.

Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!

Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌

Also Read: Ind vs NZ, 1st Test Match Highlights: ఇదేంది సామీ..! ఒక్క వికెట్టైనా తీయలేదు.. కివీస్‌ 129/0

Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Ravichandran Ashwin Axar Patel Ind Vs NZ Daniel Vettori Kanpur Test

సంబంధిత కథనాలు

Ravi Shastri News: రవిశాస్త్రి 2.0? ఆ మాటల వెనక అర్థమేంటి?

Ravi Shastri News: రవిశాస్త్రి 2.0? ఆ మాటల వెనక అర్థమేంటి?

IPL 2022: బాహుబలికి కెప్టెన్సీ ఇవ్వరేమో! ఆకాశ్‌ చోప్రా అనుమానం!!

IPL 2022: బాహుబలికి కెప్టెన్సీ ఇవ్వరేమో! ఆకాశ్‌ చోప్రా అనుమానం!!

IPL 2022: ఎంఎస్‌ ధోనీ CSK పగ్గాలు వదిలేస్తున్నాడా? మరి 'సింహం' చెన్నైలో ఎందుకు దిగినట్టు?

IPL 2022: ఎంఎస్‌ ధోనీ CSK పగ్గాలు వదిలేస్తున్నాడా? మరి 'సింహం' చెన్నైలో ఎందుకు దిగినట్టు?

PM Modi letter to Kevin Pietersen: మోదీకి పీటర్సన్‌ కృతజ్ఞతలు! మీ హిందీ ట్వీట్లు బాగుంటాయని అతడికి మోదీ లేఖ!!

PM Modi letter to Kevin Pietersen: మోదీకి పీటర్సన్‌ కృతజ్ఞతలు! మీ హిందీ ట్వీట్లు బాగుంటాయని అతడికి మోదీ లేఖ!!

Dwayne Bravo Pushpa Dance: గ్రౌండ్‌లో శ్రీవల్లి అంటూ అలరించిన బ్రేవో.. పుష్ప ఫీవర్ ఇప్పట్లో ‘తగ్గేదే లే’!

Dwayne Bravo Pushpa Dance: గ్రౌండ్‌లో శ్రీవల్లి అంటూ అలరించిన బ్రేవో.. పుష్ప ఫీవర్ ఇప్పట్లో ‘తగ్గేదే లే’!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా  చేయాలట….

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!