అన్వేషించండి

Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?

శ్రేయస్‌ అయ్యర్‌ శతకానికీ అతడి తండ్రి వాట్సాప్‌ డీపీకీ ఓ సంబంధం ఉంది. నాలుగేళ్లుగా ఆయన డీపీ మార్చలేదు. అందుకు ఓ లాజిక్‌ చెప్పారు ఆయన.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ కొట్టేశాడు. అరంగేట్రంలోనే శతకం బాదేసిన 16వ భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అతడి పరుగులతోనే భారత కాస్త మెరుగైన స్కోరు చేసింది. కాగా అయ్యర్‌ సుదీర్ఘ ఫార్మాట్లో అదరగొట్టాలని అతడి తండ్రి సంతోష్‌ కలగన్నారు. నాలుగేళ్లుగా వాట్సాప్‌ డీపీ మార్చలేదు. ఎందుకో తెలుసా?

శ్రేయస్‌ అయ్యర్‌.. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ పట్టుకున్న చిత్రాన్ని అతడి తండ్రి వాట్సాప్ డీపీగా పెట్టుకున్నారు. నాలుగేళ్లుగా మార్చలేదు. ఎందుకని అడిగితే తన కుమారుడు టెస్టు క్రికెట్లో అదరగొట్టాలన్నదే తన కలగా చెబుతున్నారు. నిరంతరం అతడికి ప్రేరణనిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.

'అవును.. ఆ డీపీ నాకెంతో ఇష్టం. ఆస్ట్రేలియా సిరీసులో విరాట్‌ కోహ్లీకి స్టాండ్‌బైగా శ్రేయస్‌ జట్టులో ఉన్నాడు. అప్పుడు ట్రోఫీని అతడికి అందించారు. అతడు ట్రోఫీని పట్టుకున్న చిత్రం నా హృదయానికి ఎంతో దగ్గరైంది' అని సంతోష్‌ అన్నారు. 'శ్రేయస్‌ ఆ ట్రోఫీ అందుకున్నప్పుడు అతడు టీమ్‌ఇండియాకు ఆడాలని బలంగా కోరుకున్నా. అతడికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా? ఎప్పుడు అదరగొడతాడా? అని ఎదురుచూశాను' అని ఆయన పేర్కొన్నారు.

'శ్రేయస్‌ ఆడతాడని అజింక్య రహానె ప్రకటించడం నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన సందర్భం. ఐపీఎల్‌, వన్డే, టీ20ల కన్నా దీనికి ఎంపికవ్వడమే నాకెంతో విలువైంది. ఎందుకంటే అసలైన క్రికెట్‌ ఇదే. నేను శ్రేయస్‌తో మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో టెస్టు క్రికెట్‌ ఆడాలని చెబుతుంటాను. అదిప్పుడు నిజమైంది. సునిల్‌ గావస్కర్‌ నాకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకరు. అందుకే అదొక గర్వపడే సన్నివేశం. ఈ ఆనందం చెప్పడానికి మాటలు రావడం లేదు' అని సంతోష్‌ వివరించారు. 

Also Read: Test Match Records: 23 ఏళ్లకే శుభ్‌మన్‌ అరుదైన రికార్డు.. సన్నీకి చేరువ అవుతాడా?

Also Read: IPL 2022 Auction: పంజాబ్‌కు రాహుల్‌ షాక్‌..! మోర్గాన్‌, డీకేను వదిలేస్తున్న కోల్‌కతా!

Also Read: Shreyas Iyer Test Debut: వాహ్.. అరంగేట్రంలోనే అదరగొట్టావుగా.. శ్రేయస్‌పై సోషల్‌మీడియా ప్రశంసలు!

Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Embed widget