Test Match Records: 23 ఏళ్లకే శుభ్‌మన్ అరుదైన రికార్డు.. సన్నీకి చేరువ అవుతాడా?
న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచులో శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు అందుకున్నాడు. అర్ధశతకం చేసిన అతడు 23 ఏళ్లలోపే ఈ ఘనత సాధించాడు.
టీమ్‌ఇండియా యువ ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ తెందూల్కర్‌కు లేని ఘనత అందుకున్నాడు. 23 ఏళ్లకే టెస్టుల్లో నాలుగు అర్ధశతకాలు చేశాడు. ఒకప్పటి క్రికెటర్ ఎంఎల్ జయసింహ రికార్డుకు చేరువలో నిలిచాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అర్ధశతకం బాదేశాడు. కేవలం 81 బంతుల్లోనే నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో ఈ ఘనత అందుకున్నాడు. చక్కని బంతులని గౌరవిస్తూనే అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించాడు.
టెస్టుల్లో శుభ్‌మన్‌కు ఇది నాలుగో అర్ధశతకం. దీంతో అతడు 23 ఏళ్లలోపే నాలుగు శతకాలు చూసిన మాధవ్ ఆప్టే సరసన నిలిచాడు. ఎంఎల్ జయసింహ కన్నా ఒక్కటి మాత్రమే తక్కువలో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధశతకం చేస్తే ఆయనతో సమంగా మూడో స్థానంలో నిలవొచ్చు. ఇక దినేశ్ కార్తీక్ 6, సునిల్ గావస్కర్ 9 అతడి కన్నా ఎంతో ముందున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఫర్వాలేదనిపించింది. భోజన విరామానికి వికెట్ నష్టపోయి 82 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (52), చెతేశ్వర్ పుజారా (15) క్రీజులో ఉన్నారు. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (13; 28 బంతుల్లో 2x4) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కైల్ జేమీసన్ ఒక వికెట్ తీశాడు.
Lunch on Day 1 of the 1st Test.#TeamIndia are 82/1 (Gill 52*, Pujara 15*)
— BCCI (@BCCI) November 25, 2021
Scorecard - https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/4lJm5a5aNx
Also Read: IPL 2022 Auction: శ్రేయస్‌కు షాకిచ్చిన దిల్లీ..! తామిద్దరినీ రీటెయిన్ చేసుకోవడం లేదన్న అశ్విన్
Also Read: Gambhir on Ajinkya Rahane: రహానె లక్కీ అనే చెప్పాలి మరి! గంభీర్ ఎందుకిలా అన్నాడో తెలుసా?
Also Read: KL Rahul Ruled Out: టీమ్‌ఇండియాకు షాక్..! కేఎల్ రాహుల్‌కు గాయం.. కివీస్‌తో టెస్టు సిరీసుకు దూరం!
Also Read: Ind vs Nz, 1st Test: అరెరె..! కోహ్లీని పలకరించిన ఈ కొత్త గెస్ట్ ఎవరో తెలుసా!!
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 మొదలయ్యేది ఆరోజే? మొదటి మ్యాచ్ ఎక్కడ.. ఎవరికి?