అన్వేషించండి

Pawan Kalyan: అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు

Deputy CM: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల్ని కబ్జా చేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. విజిలెన్స్ చర్యలకు ఆదేశించారు.

Deputy CM Pawan Kalyan releases Peddireddy Encroched forest lands video:    ఆంధ్రప్రదేశ్  ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ   సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,  కుటుంబ సభ్యుల అక్రమ భూమి ఆక్రమణలను బహిర్గతం చేసే సంచలనాత్మక వీడియోను విడుదల చేశారు. రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమించుకుని, వాటిపై అక్రమ కట్టడాలు నిర్మించారని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇటీవల ఏరియల్ సర్వేలో  స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించి వీడియోలు తీశారు. విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.                
 
చిత్తూరు జిల్లా తూర్పు కనుమలలోని మంగళంపేట  రక్షిత అటవీ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక ఏరియల్ సర్వేలో ఈ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కల్యాణ్ తన తాజా తిరుపతి పర్యటన సందర్భంగా హెలికాప్టర్‌లో ఈ ప్రాంతాన్ని సందర్శించి, భూమి ఆక్రమణలను డాక్యుమెంట్ చేశారు. వీడియోల్లో కనిపించే దృశ్యాల ప్రకారం, అటవీ మధ్యలో గెస్ట్ హౌస్‌లు, ఇతర అక్రమ నిర్మాణాలు  ఉన్నాయి.  ఈ భూములు పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వారసత్వ ఆస్తులుగా  అధికార దుర్వినియోగంతో రికార్డు మార్చారని ఆయన ఆరోపించారు. 

అటవీ భూములు మన పర్యావరణానికి, భవిష్యత్తుకు అమూల్యమైనవి. వీటిని రాజకీయ నేతలు ఆక్రమించుకోవడం అనేది తీవ్రమైన నేరం అని పవన్ స్పష్టం చేశారు.  ఈ ఆక్రమణలు వైసీపీ పాలిత దశలో జరిగాయని, తమ ప్రభుత్వం ఇటువంటి అక్రమాలను సహించదని స్పష్టం చేశారు. అధికారులకు జారీ చేసిన ఆదేశాల్లో, విజిలెన్స్ టీమ్‌లు తక్షణ చర్యలు తీసుకోవాలని, భూములు తిరిగి పొంది చట్టపరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.                  

    
పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీ, రెవెన్యూ, విజిలెన్స్ శాఖల అధికారులు తక్షణమే ఫీల్డ్ సర్వే చేపట్టనున్నారు. ఆక్రమిత భూములు తిరిగి పొందడానికి, అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్లాన్. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అటవీ భూముల ఆక్రమణలపై మొదటి పెద్ద చర్యల్లో ఒకటిగా మారనుంది.  అయితే ఇవి తప్పుడు ఆరోపణలనీ నిరాధారమని పెద్దిరెడ్డి కుటుంబం చెబుతోంది                                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Advertisement

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Type-2 Diabetes Risk : స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Panchayat Elections: ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
Priya Prakash Varrier: ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
Embed widget