KL Rahul Ruled Out: టీమ్‌ఇండియాకు షాక్..! కేఎల్ రాహుల్‌కు గాయం.. కివీస్‌తో టెస్టు సిరీసుకు దూరం!
ఓపెనర్ కేఎల్ రాహుల్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆడటం లేదు. అతడు గాయపడ్డాడని సమాచారం. గాయం తీవ్రత గురించి తెలియాల్సి ఉంది.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీసుకు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది! సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ టెస్టు సిరీసుకు దూరం అవుతున్నాడు. అతడి ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. అందుకే అతడు మంగళవారం ఉదయం సాధన చేయలేదు.
కాన్పూర్ వేదికగా గురువారం మొదటి టెస్టు జరుగుతోంది. విశ్రాంతి నేపథ్యంలో ఇప్పటికే జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరు. దాంతో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారని తెలిసింది. శుభ్‌మన్ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని జట్టు యాజమాన్యం అనుకుంది. ఇంతలోనే రాహుల్ గాయపడ్డ వార్త బయటకు తెలిసింది.
NEWS - Suryakumar Yadav replaces KL Rahul in India's Test squad.
— BCCI (@BCCI) November 23, 2021
KL Rahul has sustained a muscle strain on his left thigh and has been ruled out of the upcoming 2-match Paytm Test series against New Zealand.
More details here -https://t.co/ChXVhBSb6H #INDvNZ @Paytm pic.twitter.com/uZp21Ybajx
'న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు టీమ్‌ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమవుతున్నాడు. అతడు గాయపడ్డాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి' అని పీటీఐ ఓ ట్వీట్ చేసింది. రాహుల్ గాయపడటంతో అతడు ఉదయం గ్రీన్‌పార్క్ మైదానంలో జరిగిన సాధనకు హాజరవ్వలేదు. అయితే గాయం తీవ్రత ఏంటో? ఎక్కడ అయ్యిందో తొలుత తెలియలేదు. మరికాసేపటికే బీసీసీఐ ట్వీట్ చేయడంతో తొడ కండరాలు పట్టేశాయని తెలిసింది. ఇంగ్లాండ్ సిరీసు నుంచి కేఎల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మధ్యే పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
రాహుల్ లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లో ఎవరో ఒకరు అరంగేట్రం చేయడం ఖాయమేనని తెలుస్తోంది. సూర్యను వెంటనే జట్టులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ముంబయి జట్టు తరఫున రంజీల్లో రాణించారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైన శారీరక దృఢత్వం, నైపుణ్యాలు వీరికి ఉన్నాయి. ఇప్పుడు శుభ్‌మన్ ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి వీరిద్దరూలో ఎవరో ఒకరు మిడిలార్డర్లో ఆడతారు.
Also Read: Gambhir on Ravi Shastri: శాస్త్రిపై గౌతీ విమర్శలు.. ద్రవిడ్ సమతూకం బాగుందన్న మాజీ ఓపెనర్
Also Read: Cricketer Dog Viral Video: కుక్క ఫీల్డింగ్ కేక.. ఏకంగా సచిన్ టెండూల్కరే అలా!