Cricketer Dog Viral Video: కుక్క ఫీల్డింగ్ కేక.. ఏకంగా సచిన్ టెండూల్కరే అలా!
వికెట్ కీపింగ్ చేస్తున్న ఈ కుక్క ఏకంగా సచిన్‌నే ఇంప్రెస్ చేసింది. వీడియో కూడా షేర్ చేశారు. ఎలా ఉందో చూసేయండి!
క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక కుక్క.. ఇద్దరు పిల్లలతో క్రికెట్ ఆడుతోంది. ఈ వీడియో పాతదే అయినా.. దీన్ని చూసినవారందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఈ వీడియో చూస్తే మీరు కూడా అలాగే ఫీలవుతారేమో.. ‘ఒక ఫ్రెండ్ పంపిస్తే ఈ వీడియో చూశాను. ఈ బాల్ క్యాచింగ్ స్కిల్స్ మాత్రం చాలా షార్ప్‌గా ఉన్నాయి. మనం వికెట్ కీపర్లను, ఫీల్డర్లను, ఆల్‌రౌండర్లను చూశాం. కానీ దీనికి మీరేం పేరు పెడతారు’ అని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.
ఇదే వీడియో క్లిప్‌ను ఒకప్పటి నటి, టాక్ షో హోస్ట్ సిమి గారేవాల్ కూడా పోస్ట్ చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఆవిడ ఈ వీడియోను పోస్ట్ చేసి ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇచ్చేయచ్చు’ అని క్యాప్షన్ పెట్టారు.
Received this from a friend and I must say, those are some 'sharp' ball catching skills 😉
— Sachin Tendulkar (@sachin_rt) November 22, 2021
We've seen wicket-keepers, fielders and all-rounders in cricket, but what would you name this? 😄 pic.twitter.com/tKyFvmCn4v
Also Read: Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్ ఇది!
Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్ సూపర్ హిట్టవుతుందా?
Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!
Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్ టాస్ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్ ఛాపెల్..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి