సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
ఐపీఎల్ 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్.. ట్రేడింగ్ స్వాప్ డీల్ ద్వారా రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు వదిలేసి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఈ డీల్‌పై అఫిషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సదగొప్పన్ రమేష్ తప్పుబట్టాడు. సంజూ శాంసన్ కోసం రవీంద్ర జడేజాను వదిలేయడం csk పిచ్చి డెసిషన్ అన్నాడు.
చెపాక్‌లో సంజూ శాంసన్‌కు సరైన రికార్డ్ లేదు. ఆ పిచ్ పై ఆడిందే కొన్ని మ్యాచ్ లు. అందులోనూ ఇప్పటివరకు గొప్పగా ఆడిన ఇన్నింగ్స్ కూడా పెద్దగా లేవు. ఒకవేళ ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఫామ్ లోకి వస్తాడేమో. కానీ టర్నింగ్ ట్రాక్‌లపై సంజూ సక్సెస్ కాలేడనే వాదన కూడా ఉంది. అదే జడేజా విషయానికి వస్తే టర్నింగ్ ట్రాక్‌పై జడేజా ప్రమాదకర బౌలర్. అతన్ని ఎవరూ ఎదుర్కోలేరు. ముఖ్యంగా చెపాక్ మైదానంలో సీఎస్‌కే కమాండర్ లా ఆడే జడేజా.. ఒంటిచేత్తో సీఎస్‌కేకి చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ లు తక్కువగానే ఉన్నా.. కీలక సమయంలో జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు.
అన్నిటికంటే ముఖ్యంగా జడేజా అద్భుతమైన ఫీల్డింగ్, క్యాచ్‌లతో csk కి మోర్ పవర్ add చేయగలడు. తన ఫిట్‌నెస్‌తో మరో 2-3 ఏళ్లు ఈజీగా ఐపీఎల్ ఆడగలడు. అలాంటి జడేజాను వదిలేస్తే సీఎస్‌కే కచ్చితంగా వీక్ అవుతుంది. మరి సంజును తీసుకోవడం వల్ల చెన్నై టీమ్ స్ట్రాంగ్ అవుతుందా? అంటే అవునని పక్కాగా చెప్పలేం. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఫ్లాట్ వికెట్లపై ఆడటం జడేజాకి కూడా సవాలే. అంటే ఇది రెండు టీమ్స్ కి నష్టమే.'అని సదగొప్పన్ రమేష్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ కెప్టెన్ కోసం వెతుకుతున్న రాజస్థాన్ టీం.. జడేజాని కెప్టెన్ చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి ట్రేడ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది





















