Shreyas Iyer Test Debut: వాహ్.. అరంగేట్రంలోనే అదరగొట్టావుగా.. శ్రేయస్‌పై సోషల్‌మీడియా ప్రశంసలు!
భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. తన మొదటి మ్యాచ్‌లోనే శ్రేయస్ అర్థ సెంచరీ చేయడం విశేషం.
జట్టు స్కోరు 106 పరుగుల వద్ద పుజారా అవుట్ కావడంతో శ్రేయస్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత 145 పరుగుల వద్ద కెప్టెన్ అజింక్య రహానే కూడా అవుట్ కావడంతో భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రవీంద్ర జడేజాతో కలిసి శ్రేయస్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 100కు పైగా భాగస్వామ్యం అందించారు.
శ్రేయస్ అయ్యర్‌తో పాటు జడేజా కూడా అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అర్థ సెంచరీపై నెటిజన్ల వద్ద నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. శిఖర్ ధావన్ కూడా ట్వీట్‌తో శ్రేయస్‌ను అభినందించాడు.
Congratulations on your Test debut and half century @ShreyasIyer15 👏 All the hard work you’ve put in has paid off bro 🤗🇮🇳 pic.twitter.com/YKMLv5MtrG
— Shikhar Dhawan (@SDhawan25) November 25, 2021
#BCCI should include #ShreyasIyer in all three formats coz he has special talent as player and able to do captaincy as well in future if chances. #NZvsIND #india #NewZealand #WTC23 #TestCricket
— Srikanth Reddy (@srkanz8805) November 25, 2021
India No.5 with Test 50+ score on debut since 1970:
— Pratyush Mahapatra (@cricketpratyush) November 25, 2021
Mohammad Azharuddin v ENG, 1984
S Badrinath v SA, 2010
Shreyas Iyer v NZ, 2021
(Source: @Cricketracker ) #INDvNZ #ShreyasIyer @ShreyasIyer15 #CricketTwitter
From Struggling With A Serious Shoulder Injury
— σɳ ɱყ ωαყ (@narasimha_chow2) November 25, 2021
To
Making His Test Debut In The Same Year
Nd Scored Half Century On Debut@ShreyasIyer15 🙌❤️#INDvNZ #ShreyasIyer pic.twitter.com/7OZQaf6qVb
Also Read: IPL 2022 Auction: శ్రేయస్‌కు షాకిచ్చిన దిల్లీ..! తామిద్దరినీ రీటెయిన్ చేసుకోవడం లేదన్న అశ్విన్
Also Read: Gambhir on Ajinkya Rahane: రహానె లక్కీ అనే చెప్పాలి మరి! గంభీర్ ఎందుకిలా అన్నాడో తెలుసా?
Also Read: KL Rahul Ruled Out: టీమ్ఇండియాకు షాక్..! కేఎల్ రాహుల్‌కు గాయం.. కివీస్‌తో టెస్టు సిరీసుకు దూరం!
Also Read: Ind vs Nz, 1st Test: అరెరె..! కోహ్లీని పలకరించిన ఈ కొత్త గెస్ట్ ఎవరో తెలుసా!!
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 మొదలయ్యేది ఆరోజే? మొదటి మ్యాచ్ ఎక్కడ.. ఎవరికి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి