Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్
శ్రీలంక ఉమెన్ క్రికెట్‌లో కలకలం రేగింది. ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. జింబాబ్వేలో జరుగుతున్న వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.
జింబాబ్వేలో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న ఆరుగురు శ్రీలంక మహిళా క్రికెటర్లు కరోనా పాజిటివ్ నిర్దరణైంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది.
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ గుర్తించిన తర్వాత ఐసీసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. శనివారం జరగాల్సిన క్వాలిఫైర్ మ్యాచ్‌లను రద్దు చేసింది. కరోనా మరింత విస్తృతంగా వ్యాప్తి చెందకుండా ఆటగాళ్లను హోటల్ రూమ్‌లకే పరిమితం చేసింది. అయితే ఇప్పుడు శ్రీలంక ఆటగాళ్లకు వచ్చింది కొత్త వేరియంటా కాదా అనేది మాత్రం ఇంకా నిర్దారణ కాలేదు.
శనివారం వెస్టిండీస్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇంతలో శ్రీలంక టీంలో సపోర్టింగ్ స్టాప్‌లో ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా మ్యాచ్‌ను నిలిపేసింది ఐసీసీ. శ్రీలంక ఆటగాళ్లందరికీ టెస్టులు చేయిస్తే.. ఆరుగురికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది.
జట్టు ఇప్పటికీ జింబాబ్వేలో ఉందని... వీలైనంత త్వరగా వారిని శ్రీలంకకు తిరిగి తీసుకురావడానికి ICCతో మాట్లాడుతున్నామని తెలిపారు శ్రీలంగ క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డి సిల్వా. పాజిటివ్‌గా నిర్దారణైన ఆటగాళ్లు మాత్రం నెగిటివ్ వచ్చే వరకు జింబ్లాబ్వేలోనే ఉండాల్సి వస్తుందన్నారు. జట్టుతోపాటు ఒక వైద్యుడు శ్రీలంకకు వస్తాడు.
స్క్వాడ్‌లోని నాన్-ఇన్‌ఫెక్ట్ సభ్యులు త్వరగా తిరిగి తీసుకొస్తున్నప్పటికీ వాళ్లపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించనుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పూర్తి పరీక్షలు జరిపిన తర్వాత వాళ్లను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వీళ్లు దక్షిణాఫ్రికా మీదుగా వస్తుండడంతో ఈ నిబంధనలు పాటించాల్సి వస్తోందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉంచిన తర్వాత పాజిటివ్ రాకుంటే ఇళ్లకు పంపిస్తారు.
క్వాలిఫయర్‌ల రద్దు తర్వాత ర్యాంకింగ్ ఆధారంగానే వ చ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే ఉమెన్ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్ పాల్గొంటాయని ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో ఈ మూడు జట్లు చేరనున్నాయి.
Also Read: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
Also Read: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న సల్మాన్ ఖాన్... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
Also Read: బాల్ తగిలితే... ఆ దెబ్బకు పాతిక కుట్లు పడ్డాయి. నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది!
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి