By: ABP Desam | Updated at : 29 Nov 2021 07:06 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వచ్చే సంవత్సరం ఐపీఎల్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పాల్గొంటుందా లేదా అనే విషయంపై సందిగ్థం నెలకొంది.
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్‌లను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తీసుకోనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ వచ్చే ఐపీఎల్ ఆడేది లేనిది అనుమానమే అని తెలుస్తోంది. 2022 సీజన్‌కు ఐపీఎల్ మెగా వేలానికి కొన్ని రోజుల ముందు పరిస్థితి ఇది.
కొన్నిరోజుల క్రితం బీసీసీఐ అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం ఐరీలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(సీవీసీ క్యాపిటల్ భాగస్వాములు) ఐపీఎల్ టీమ్ నిర్వహించేందుకు బీసీసీఐ ఇంకా అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
అక్టోబర్ 25వ తేదీన రూ.5,625 కోట్ల బిడ్‌తో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్ పొందింది. అయితే ఈ సంస్థ ఒక బెట్టింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కంపెనీ ఐపీఎల్‌లో పాల్గొనేందుకు బీసీసీఐ అనుమతులు ఇస్తుందో లేదో చూడాలి.
అయితే దీనిపై బీసీసీఐ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మెగా ఆక్షన్‌లోపు దీనిపై ఏమైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.
ఐపీఎల్ 2022 ఆటగాళ్ల రిటెన్షన్ గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. తాము రిటైన్ చేసుకోవాలనుకుంటున్న ఆటగాళ్ల జాబితాను గడువు లోపే సమర్పించాలని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలను కోరింది. అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలకు డిసెంబర్ 25వ తేదీ వరకు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకునేందుకు సమయం ఉంటుంది. ఆ తర్వాత మెగా ఆక్షన్ జరగనుంది.
Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!
Also Read: IND vs NZ Kanpur Test: యాష్ నువ్వే భేష్..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ
Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్
Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?
Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్ ప్లేయర్
Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
IPL 2022, Qualifier 1 Preview: ఫైనల్స్ మొదటి బెర్త్ ఎవరిది? - టైటాన్స్, రాయల్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి?
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
KTR Jagan Meet: దావోస్‌లో అరుదైన కలయిక, ఒకే ఫ్రేములో డైనమిక్ లీడర్స్ - ‘అక్కడా ఏపీ పరువు తీస్తున్నారా’ అని నెటిజన్ల ఫైర్!
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Simple Hacks: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి