WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ అనంతరం టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ థ్రిల్లింగ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్.. న్యూజిలాండ్‌కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి మ్యాచ్ డ్రాగా ముగించింది. భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఏడు వికెట్లు తీసుకోవడం విశేషం.
2021-2023 వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికను చూడండి.
Here's how the teams stack up in the #WTC23 standings after that thrilling draw between India and New Zealand in Kanpur 👀 pic.twitter.com/VxGmkMlbfQ
— ICC (@ICC) November 29, 2021
ఇండియా, న్యూజిలాండ్ మొదటి టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం భారత్ నాలుగు ముఖ్యమైన పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు భారత్ 30 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే వాళ్ల పీసీటీ శాతం (మొత్తం పాయింట్లలో గెలిచిన మ్యాచ్‌ల్లో వచ్చిన పాయింట్లు) ఎక్కువగా ఉండటంతో లంకేయులు మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఓవరాల్ పాయింట్ల విషయంలో మాత్రం భారత్‌కు 30 పాయింట్లు ఉండగా.. శ్రీలంక దగ్గర 12 పాయింట్లే ఉన్నాయి.
పాయింట్ల పట్టికలో జట్టు స్థానాన్ని పాయింట్ల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. ఐసీసీ నియమాల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు, డ్రా చేసుకుంటే నాలుగు పాయింట్లు లభిస్తాయి. కానీ ఓడిపోతే మాత్రం ఒక్క పాయింట్ కూడా లభించదు.
పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో శ్రీలంకతో సమానంగా ఉన్న పాకిస్తాన్ మాత్రం టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. వీరు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒకటి గెలిచి మరొకటి ఓడారు. వెస్టిండీస్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ దగ్గర 14 పాయింట్లు ఉన్నాయి.
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఈ టెస్టు చాంపియన్ షిప్ 2023 మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఫైనల్ వేదికను ఇంకా ఖరారు చేయలేదు.
Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!
Also Read: IND vs NZ Kanpur Test: యాష్ నువ్వే భేష్..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ
Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్
Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?
Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్ ప్లేయర్
Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి