అన్వేషించండి
Advertisement
IPL Highest Paid Players: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్ తాజా కోటీశ్వరులు వీరే
ఐపీఎల్ రీటెన్షన్‌లో ఫ్రాంచైజీలు యువతకే పెద్ద పీట వేశాయి. వారి వేతనాలను భారీగా పెంచాయి. వెంకటేశ్ అయ్యర్ నుంచి ఉమ్రాన్ వరకు ఎక్కువ మొత్తం అందుకుంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఇంకా జరగనే లేదు! కొందరు కుర్రాళ్లు అప్పుడే కోటీశ్వరులు అయిపోయారు. లక్షల్లో ఉండే కనీస ధర నుంచి కోట్లకు ఎదిగిపోయారు. స్టార్ ప్లేయర్లకూ షాకులిస్తూ పైపైకి దూసుకు పోయారు. కోల్‌కతా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ సాలరీ ఏకంగా 4000 శాతం పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు!
- రవీంద్ర జడేజా: సీఎస్‌కే తొలి ప్రాధాన్యం జడ్డూకే ఇచ్చింది. దాంతో అతడు రూ.16 కోట్లు కొట్టేశాడు.
- మయాంక్ అగర్వాల్: పంజాబ్ కింగ్స్‌కు కేఎల్ రాహుల్ షాకివ్వడంతో మయాంక్‌కు డిమాండ్ పెరిగింది. రూ.కోటి నుంచి అతడి వేతనం రూ.12 కోట్లకు చేరుకుంది.
- సంజు శాంసన్: రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్ వేతనం రూ.8 కోట్ల నుంచి రూ.14 కోట్లకు చేరుకుంది.
- కేన్ విలియమ్సన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ సాలరీ ఇంతకు ముందు తక్కువగా ఉండేది. ఇప్పుడు రూ.14 కోట్లకు చేరుకున్నాడు.
- ఉమ్రాన్ మాలిక్: చురకత్తుల్లాంటి బంతులు వేసే ఈ జమ్ముకశ్మీర్ ఆటగాడి ధర రూ.10 లక్షల నుంచి రూ.4 కోట్లకు పెరిగింది.
- అబ్దుల్ సమద్: ఆ ఆల్‌రౌండర్ ధర రూ.20 లక్షల నుంచి రూ.4 కోట్లకు చేరుకుంది.
- ఆండ్రీ రసెల్: కోల్‌కతా ఈ ఆల్‌రౌండర్‌పై నమ్మకం ఉంది. రూ.8.5 కోట్ల నుంచి వేతనాన్ని రూ.12 కోట్లకు పెంచింది.
- జస్ప్రీత్ బుమ్రా: ఈ ముంబయి పేసుగుర్రం సాలరీ రూ.5 కోట్ల నుంచి రూ.12 కోట్లకు పెరిగింది. వేలంలోకి వెళితే అతడికి ఇంకా ఎక్కువ వస్తుంది!
- జోస్ బట్లర్: ఈ మెరుపు ఆటగాడి ధర రూ.4.4 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెరిగింది.
- అక్షర్ పటేల్: తన ఆటతీరును మెరుగుపర్చుకున్న అక్షర్ ధర రూ.9 కోట్లకు చేరుకుంది.
- వెంకటేశ్ అయ్యర్: కోల్‌కతా నైట్‌రైడర్స్ తెలివైన నిర్ణయం తీసుకుంది. అయ్యర్ ధరను రూ.20 లక్షల నుంచి రూ.8 కోట్లకు పెంచింది. వేలంలోకి వస్తే అతడికి మరింత ధర పెరిగేది.
- వరుణ్ చక్రవర్తి: ఈ మిస్టరీ ధర వేతనం రూ.4 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పెరిగింది.
- సూర్యకుమార్ యాదవ్: ముంబయి ఈ 360 డిగ్రీ ఆటగాడి ధర 3.2 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పెంచారు.
- పృథ్వీ షా: దిల్లీ ఈ ఓపెనర్ ధరను రూ.1.2 కోట్ల నుంచి రూ.7.50 కోట్లకు పెంచింది.
- మహ్మద్ సిరాజ్: బెంగళూరు సిరాజ్‌పై నమ్మకం ఉంచింది. రూ.2.6 కోట్ల నుంచి రూ.7 కోట్లకు పెంచింది.
- రుతురాజ్ గైక్వాడ్: ఈ ఓపెనర్ స్థాయికి తగ్గ ధర దక్కించుకున్నాడు. కనీస ధర నుంచి రూ.6 కోట్లకు చేరుకున్నాడు.
- అర్షదీప్ సింగ్: ఈ పంజాబ్ యువ పేసర్ ధర రూ.20 లక్షల నుంచి రూ.4 కోట్లకు పెరిగింది.
- యశస్వీ జైశ్వాల్: రాజస్థాన్ జైశ్వాల్‌పై నమ్మకం ఉంచింది. రూ.4 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.
Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు
Also Read: SRH Retention 2022: కథ మళ్లీ మొదటికే.. ‘0’ నుంచి షురూ చేయాల్సిందే కేన్ మామా!
Also Read: IPL Retention: ధోనీ లేని చెన్నై..! మహీని తీసుకోవద్దంటూ గంభీర్ సూచన!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement