FIFA World Cup 2022: అందరి దృష్టి రొనాల్డో పైనే - ఘనా షాకిస్తుందా?
ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్, ఘనా మ్యాచ్ పైనే అందరి దృష్టి నెలకొంది.
ఫిఫా వరల్డ్ కప్ 2022లో పోర్చుగల్ తన మొదటి మ్యాచ్‌ను ఘనాతో ఆడనుంది. మాంచెస్టర్ యునైటెడ్‌తో బంధం తెంచుకున్నాక క్రిస్టియానో రొనాల్డో ఆడనున్న మొదటి మ్యాచ్ ఇదే. కాబట్టి ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. దీంతోపాటు వచ్చే సంవత్సరం రొనాల్డో ఏ క్లబ్ తరఫున ఆడతాడో అనే ఆసక్తి కూడా ఉంది.
ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఈ వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరెట్లకు షాకులు తగులుతూనే ఉన్నాయి. అర్జెంటీనాకు ఖతార్, జర్మనీకి జపాన్ ఇప్పటికే షాకిచ్చాయి. దీంతో పోర్చుగల్‌ను ఘనా ఏమైనా అప్‌సెట్ చేస్తుందా అని చూడాలి.
పోర్చుగల్ ఉన్న గ్రూప్-హెచ్ చాలా టఫ్‌గా ఉంది. పోర్చుగల్, ఘనాలతో పాటు బలమైన ఉరుగ్వే, దక్షిణ కొరియా కూడా ఈ గ్రూపులో ఉన్నాయి. కాబట్టి ముందుకు వెళ్లాలంటే పోర్చుగల్ మరింత కష్టపడక తప్పదు. రొనాల్డో జోరుకు ఆంటోనియా సిల్వా, రుబెన్ డియాస్ డిఫెన్స్ తోడయితే పోర్చుగల్‌ను ఆపడం ఏ జట్టుకైనా కష్టమే.
ఇక జర్మనీ, జపాన్‌ల మ్యాచ్‌పై ఓ లుక్కేస్తే... మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే జర్మనీ గోల్ కొట్టి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ జట్టు ఆటగాడు గుండోగన్ 33వ నిమిషంలో గోల్ చేశాడు. అయితే ఆ తర్వాత జపాన్ ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్ చేయడమే కాక జర్మనీకి ఇంకో గోల్ కొట్టే అవకాశం ఇవ్వలేదు. జపాన్ తరఫున రిస్తో డోన్ 75వ నిమిషంలో... టకుమా అసానో 83వ నిమిషంలో గోల్స్ చేశారు. దీంతో జర్మనీపై 2-1 తేడాతో జపాన్ విజయం సాధించింది.
మ్యాచ్ విశేషాలు
● మొదటి అర్ధభాగంలో ఆధిక్యంలో ఉండి జర్మనీ మ్యాచ్ ఓడిపోవడం 1978 తర్వాత ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ ముందు వరకు వారు 21 మ్యాచులలో ఓటమి లేకుండా అజేయంగా ఉన్నారు.
● గేమ్ లో వెనుకబడి గెలవడం జపాన్ కు ఇది మొదటిసారి. ఈ మ్యాచు ముందు వరకు వారు ఆడిన 13 మ్యాచుల్లో రెండు డ్రా కాగా.. 11 మ్యాచుల్లో ఓడిపోయింది.
● జర్మనీ జట్టు మొదటి 18 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో (W13 D4) కేవలం ఒకదానిలో మాత్రమే తమ తొలి గేమ్ ఓడిపోయింది. గత 2 ప్రపంచకప్‌లలో ప్రతి దానిలోనూ మొదటి మ్యాచును కోల్పోయింది.
● ఒకే ప్రపంచకప్ లో ఇద్దరు సబ్ స్టిట్యూట్ లు (రిట్స్ డోన్, టకుమా అసనో) గోల్స్ చేసిన జట్టుగా జపాన్ నిలిచింది.
View this post on Instagram