FIFA Worldcup 2022: రిటైర్ అయ్యే యోచనలో నెయ్‌మార్ - ఫిఫా ఓటమి ఎంత పని చేసిందో!
బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు నెయ్‌మార్ ప్రపంచకప్ ఓటమి అనంతరం రిటైర్మెంట్ యోచనలో ఉన్నాడు.
FIFA WC 2022: ఫిపా వరల్డ్ కప్ 2022లో బ్రెజిల్ ప్రయాణం క్వార్టర్-ఫైనల్‌లో ముగిసింది. క్రొయేషియాపై పెనాల్టీ షూటౌట్‌లో నెయ్‌మార్ అండ్ కో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లిన వెంటనే నెయ్‌మార్ చాలా నిరాశగా కనిపించాడు. జట్టు ఓడిపోయినప్పుడు అతను తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఈ ఓటమికి నెయ్‌మార్ చాలా బాధపడ్డాడు. అతను త్వరలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్ అయ్యే అవకాశం ఉంది.
‘ప్రస్తుతం వాతావరణం వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడటం సరికాదు. బహుశా నేను సూటిగా ఆలోచించడం లేదు. ఇది ముగింపు అని చెప్పడం బహుశా చాలా తొందరగా ఉంటుంది, కానీ నేను దేనికీ హామీ ఇవ్వలేను. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో. ప్రస్తుతం నేను ఏమి చేస్తే బాగుంటుంది మరియు నేను ఏమి చేయగలను అని ఆలోచించాలనుకుంటున్నాను. నేను బ్రెజిల్‌కు ఆడేందుకు తలుపులు మూయను, కానీ నేను 100 శాతం హామీ ఇవ్వలేను.’ అని నెయ్‌మార్ అన్నారు.
పీలేను సమానం చేసిన నెయ్‌మార్
క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు గోల్ చేయలేకపోయినప్పటికీ 30 నిమిషాల అదనపు సమయం ప్రథమార్థంలో నెయ్‌మార్ గోల్ చేసి బ్రెజిల్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే కొద్దిసేపటికే క్రొయేషియా స్కోరును సమం చేయడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. ఈ ఒక్క గోల్‌తో నెయ్‌మార్ భారీ రికార్డును సమం చేశాడు. పీలేతో కలిసి బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లు బ్రెజిల్ తరఫున చెరో 77 గోల్స్ చేశారు. ఇప్పుడు నెయ్‌మార్ బ్రెజిల్‌కు మళ్లీ ఆడకపోతే అది వేరే విషయం. అయితే అతను ఆడుతూనే ఉంటే బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు అవుతాడు.
View this post on Instagram
View this post on Instagram