Spiritual Lakes in India: అత్యంత పవిత్రమైన 5 సరస్సులు - ఇవే పంచ సరోవరాలు!
Panch Sarovar : పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు తప్పనిసరిగా చేసే యాత్రలు పంచ సరోవరాలు. ఈ 5 సరోవరాల దగ్గర తర్పణాలు విడిస్తే పితృదేవతలకి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. ఏంటా సరోవరాలు..
Spiritual Lakes in India: హిందూ సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నారు. వేద కాలంలో తీర్థమనే పదానికి సరస్సు అనే అర్థం. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలంటారు. దేశంలో ఎన్నో ప్రముఖ క్షేత్రాలు లానే ఎన్నో సరోవరాలు కూడా ఉన్నాయి. కానీ వాటిలో ఆధ్యాత్మికపరంగా 5 ముఖ్యమైనవిగా చెబుతారు. వాటినే పంచ సరోవరాలు అంటారు. అవేంటో తెలుసుకుందాం...
మానస సరోవరం
సమస్త లోకాలలో మానస సరోవరం లాంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది శాస్త్రవచనం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని ‘బ్రహ్మసరం’ అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం నుంచే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన చాలాచోట్ల కనిపిస్తుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం. ఈ మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14 వేల 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు . 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.
Also Read: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!
పంపా సరోవరం
పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణ కాలం నాటిదని చెబుతారు. ఓ కథనం ప్రకారం ఒక బోయకాంత అయిన శబరి పంపానదీ తీరంలో మాతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూసేది. సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపా సరోవర తీరానికి చేరుకున్నారు. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్ధురాలినయ్యాను నీ అనుగ్రహం వలన దివ్య లోకాలకు చేరుకుంటానని రాముడిసేవలో తరించింది. ఇక్కడి వనాల మహిమలను గురించి చెప్పమని శ్రీరాముడు అడిగితే అప్పుడు పంపా సరోవరం విశిష్టత గురించి చెప్పింది శబరి. మునులు తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్త సాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.
Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం
పుష్కర సరోవరం
పద్మ పురాణంలో ఈ తీర్థం గురించి వివరించారు. ఓసారి బ్రహ్మదేవుడు రాక సందర్భంగా ఇక్కడన్న చెట్లన్నీ ఘన స్వాగతం పలికాయి. ఆ స్వాగతానికి ముగ్దుడైన బ్రహ్మ ఏదైనా వరం కోరుకోమన్నాడు. బ్రహ్మ అక్కడే ఉండాలని ఆ వృక్షాలు కోరుకోవడంతో తనకు గుర్తుగా ఓ తామర పువ్వును నేలపై వదిలాడు. ఇక్కడున్న బ్రహ్మ ఆలయం సమీపంలోనే ఉంది పుష్కరసరోవరం. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని అంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పణాలను చేస్తుంటారు. రాజస్థాన్ లోని అజ్మీర్ సమీపంలో ఉంది ఈ సరోవరం.
Also Read: ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!
నారాయణ వన సరోవరం
ఈ సరోవరం గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలో ఉంది. భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసర ప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణం. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలుస్తారని చెబుతారు.
Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం
బిందు సరోవరం
గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం ప్రాంతంలో కపిలముని తపస్సు చేశాడని చెబుతారు. ఓ పురాణ కథనం ప్రకారం స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్త వయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు.ఇక్కడకు రాగానే కర్దముడు కనిపించాడు. తన కూతురికి తగిన వరుడు దొరికాడని సంతోషిస్తున్న సమయంలో కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం. ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు విడుస్తారు. ఇక్కడ మాతృ దేవతలకు మాత్రమే తర్పణాలు వదులడం విశేషం....