(Source: ECI/ABP News/ABP Majha)
Cremation Rules: అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత శ్మశానం నుంచి వచ్చేస్తూ వెనక్కి తిరిగిచూస్తే!
Cremation Rules: సనాతన ధర్మంలో మరణానికి సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలకు హాజరైన తర్వాత చేయవలసిన పనులు, చేయకూడని పనులు స్పష్టంగా పేర్కొన్నారు.
Cremation Rules: సనాతన ధర్మంలో ప్రజలు తమ సొంత ప్రయోజనం, శ్రేయస్సు కోసం అనుసరించాల్సిన 16 సంస్కారాలను వివరించారు. ఈ సంస్కారాల్లో ఒకటి మరణానంతర కార్యక్రమానికి సంబంధించినది. అంత్యక్రియలకు, దహన సంస్కారాలకు హాజరైన తర్వాత లేదా అంత్యక్రియలు చేసిన తర్వాత చేయవలసిన విధులు, చేయకూడని పనులను ఈ సంస్కారాలు వివరిస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి అంతిమ సంస్కారాలు, అన్ని ఆచారాలు ముగిసిన తర్వాత ఆత్మ బయలుదేరి దైవంలో కలిసి పోతుంది. తద్వారా ఆ జీవికి ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలు తొలగిపోతాయి. అంత్యక్రియలు, దహన సంస్కారాలకు సంబంధించిన ఈ నియమాలు ఎందుకు రూపొందించారు. ఈ నిబంధనల వెనుక ఏదైనా మత విశ్వాసం లేదా ఏదైనా శాస్త్రీయ కోణం ఉందా? ఈ నియమాల వెనుక ఉన్న కారణాలను, వాటి ప్రాముఖ్యతను పరిశీలిద్దాం.
Also Read : ఈ సంకేతాలు ఎదురవుతున్నాయా - అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్టే!
దహన సంస్కారాల్లో తెల్లని వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?
ఎవరైనా దహన సంస్కారాలకు వెళ్లినప్పుడు తెల్లని దుస్తులు ధరించడం వెనుక ప్రత్యేక కారణం ఉంది (అంతిమ సంస్కార నియమం). నిజానికి, తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శాంతిని, పరిశుభ్రతను సూచిస్తుంది. ఈ రంగు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది, సానుకూల శక్తి ప్రకాశాన్ని బలపరుస్తుంది. ఒకరి దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు శ్మశానవాటికకు వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ప్రతికూల శక్తులు వారికి దూరంగా ఉండేందుకు తెల్లని దుస్తులు ధరిస్తారు.
అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకండి
అంతిమ సంస్కారాలు, ఆత్మ మరణానంతర జీవితం గురించి గరుడ పురాణంలో వివరణాత్మక వర్ణన ఉంది. ఈ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి అంత్యక్రియల నుంచి తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా చేయడం ద్వారా, మరణించిన వ్యక్తి ఆత్మ చూసేవారితో ప్రేమలో పడుతుంది. తన నిష్క్రమణ కారణంగా ఆ వ్యక్తి మాత్రమే విచారంగా ఉన్నాడని ఆత్మ భావిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ ఆత్మ శాంతిని పొందదు, ఆ వ్యక్తితో అనుబంధాన్ని పెంచుకుంటుంది. ఆ ఆత్మ ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటుంది.
శ్మశానవాటిక నుంచి వచ్చిన తర్వాత ఇలా చేయండి
ఒక వ్యక్తి అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలకు హాజరైన తర్వాత తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయాలి. దీనితో పాటు దహన సంస్కారాల సమయంలో ధరించిన దుస్తులు ఉతకాలి. దీని తర్వాత గంగాజలం ఇల్లంతా చల్లాలి. ఇవన్నీ చేయడానికి కారణం శ్మశానవాటికలో అనేక రకాల ప్రతికూల శక్తులు నివసిస్తాయి, అవి మీ దుస్తుల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. స్నానం చేయడంతో పాటు గంగాజలం ఇల్లంతా చల్లడం ద్వారా ఈ ప్రతికూల శక్తుల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
Also Read : పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!
ఇలా చేయడం వల్ల ఆత్మ సంతోషిస్తుంది
గరుడ పురాణం ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మ శాంతి కోసం 12 రోజుల పాటు నిరంతరం దీపం వెలిగించాలి. దీనితో పాటు పితృ పక్షంలో పిండ ప్రదానం కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మ సంతోషించి శాంతిని పొందుతుంది. ఆ తర్వాత అది తన తదుపరి ప్రయాణం కోసం వైకుంఠధామానికి బయలుదేరుతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.