News
News
వీడియోలు ఆటలు
X

luck Signs:ఈ సంకేతాలు ఎదుర‌వుతున్నాయా - అదృష్టం మీ ఇంటి త‌లుపు త‌ట్టిన‌ట్టే!

luck signs:అదృష్టం క‌లిసి రావాల‌ని, జీవితంలో ఉన్న‌త స్థితికి చేరుకోవాల‌ని అంద‌రూ భావిస్తారు. ప్ర‌తి ఒక్క‌రికీ అదృష్ట ఘ‌డియ‌లు ప్ర‌వేశించే సమయంలో కొని్న సంకేతాలు ఎదురవుతాయి. వాటిని ఎలా గుర్తించాలి?

FOLLOW US: 
Share:

Luck signs: ప్రతి ఒక్క‌రూ జీవితంలో మంచి సమయం కోసం ఎదురు చూస్తారు. స‌మాజంలో ఉన్న‌త స్థాయికి చేర‌డానికి, పురోగతి సాధించడానికి స‌రైన‌ సమయం రావాల‌నుకుంటారు. ఒక వ్యక్తికి మంచి రోజులు ప్రారంభమైనప్పుడు, అతను సంతోషకరమైన జీవితాన్ని అనుభ‌వించ‌డంతో పాటు, ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. ఆ స‌మ‌యంలో అతను సంపద కొరతను అనుభవించడు. మంచి రోజులు వచ్చినప్పుడు లేదా అదృష్టం మీకు అండ‌గా ఉన్నప్పుడు, కొన్ని సంకేతాలు పొందడం ప్రారంభ‌మ‌వుతాయి. మంచి రోజులు వచ్చినప్పుడు, అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది, జీవితంలో అన్ని ఆనందాలను అందిస్తుంది. మంచి సమయాలకు సంబంధించిన 10 శుభ సంకేతాల గురించి తెలుసుకుందాం.

కొత్త జంట
మీరు ఏదో ఒక పని నిమిత్తం ఉదయాన్నే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళుతున్న‌ప్పుడు, దారిలో కొత్త జంటను మీకు ఎదురైతే మీ మంచి సమయం ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకోండి. మంచి రోజులు ప్రారంభానికి దీనిని శుభ సంకేతంగా పరిగణిస్తారు.

పక్షి స్పర్శ
ఏదైనా పక్షి వచ్చి మిమ్మ‌ల్ని తాకినా, వాలినా దాని గురించి దిగులు చెంద‌వ‌ల‌సిన‌ అవసరం లేదు. ఇది మీకు మంచి రోజులు రాబోతున్నాయనడానికి సంకేతం కావచ్చు. పక్షి ఒక వ్యక్తిని తాకినప్పుడు, అతని అదృష్టం మొదలవుతుందని బ‌లంగా నమ్ముతారు.

ఈ జంతువుల‌ను చూడటం
మీరు ప్రయాణాలు చేస్తున్న‌ సమయంలో పాములు, కోతులు కనిపిస్తే, అది మంచి సమయానికి శుభసూచకం. ఇది మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది. మీ ఇంట్లోకి ధన ప్రవాహం ప్రారంభం కావ‌చ్చు. అంతే కాదు ఇంట్లో గబ్బిలం గూడు ఉంటే శుభప్రదమ‌ని భావిస్తారు.

Also Read: నిజ‌మైన‌ ఆదిపురుషుడు ఎవ‌రో తెలుసా!

రాలుతున్న నక్షత్రం
రాత్రిపూట ఆకాశం నుంచి నక్షత్రాలు పడటం చూస్తే, మీ కోరిక‌ వెంటనే నెర‌వేర‌బోతోంద‌ని సంకేతం. ఎంత‌టి క‌ఠిన‌మైన‌దైనా ఆ కోరిక 30 రోజుల్లో నెరవేరుతుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తారు. ఇది శుభ సంకేతంగా కూడా పరిగణిస్తారు.

తాబేలు
తాబేలును చూడటం మంచి సంకేతం. తాబేలును కూర్మం అని కూడా అంటారు. కూర్మావతారం అయిన విష్ణువు అవతారాలలో తాబేలు కూడా ఒకటి. మీకు కలలో తాబేలు క‌న‌బ‌డితే అదృష్టానికి సంకేతం. ఈ విధంగా మీ అదృష్టం ప్రకాశిస్తుంది.

నెమలి
మీరు మీ ఇంటి దగ్గర లేదా రోడ్డుపై నెమలిని చూసినట్లయితే లేదా నెమలి నాట్యం చేయడం చూస్తే ఆ రోజు నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. నెమలిని చూడటం శుభప్రదంగా భావిస్తారు.

ఏనుగు
మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగు నిలబడితే, లక్షీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోవాలి. మీ కుటుంబం ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఏనుగును వినాయకుడి ప్ర‌తిరూపంగా భావిస్తారు.

కోకిల
ఇంటి పైకప్పు మీద కోకిల కూయడం కూడా శుభసూచకమే. ఇది జరిగితే, మీ సంపద పెరుగుతుంది. ఇది ఇంటికి సంపద రాకకు సూచన. ఇది మీ డబ్బు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.

బంగారు పాము
మీకు కలలో లేదా రోడ్డుపై బంగారు రంగు పాము కనిపిస్తే, మీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఇది అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు.

Also Read: అక్రమ సంబంధాలకు కూడా గ్రహస్థితే కారణమా, జాతక చక్రంలో ఈ గ్రహాలు అస్సలు కలసి ఉండకూడదు!

పాలు, పెరుగు
మీరు ఉదయం నిద్ర లేవగానే ముందుగా పాలు లేదా పెరుగు కనిపిస్తే అది మీ అదృష్టానికి సంకేతం. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే వీటిని చూస్తే మీ అదృష్ట ద్వారం తెరుచుకున్నట్లే.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 12 May 2023 10:03 AM (IST) Tags: Life auspicious sign luck signs luck start

సంబంధిత కథనాలు

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Jyeshta Maas Food: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!

Jyeshta Maas Food: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?