News
News
వీడియోలు ఆటలు
X

Astrology: అక్రమ సంబంధాలకు కూడా గ్రహస్థితే కారణమా, జాతక చక్రంలో ఈ గ్రహాలు అస్సలు కలసి ఉండకూడదు!

Astrology: మీ రాశి చక్రంలో కొన్ని గ్రహాలు కలసి ఉంటే మీ బుద్ధి సక్రమంగా ఉండదంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి ఏ ఏ గ్రహాలు కలసి ఉండకూడదు..ఎందుకు..ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం....

FOLLOW US: 
Share:

 Astrology: ఓ వ్యక్తి జాతకం రాయాలన్నా ముందుగా చక్రాలు వేస్తారు. వాటిని రాశి చక్రం, అంశ చక్రం అంటారు. పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో సూచిస్తూ ఆయా గ్రహాల స్థానాలను ఆయా చక్రాల్లో పొందుపరుస్తారు. కొన్ని స్థానాల్లో రెండు మూడు గ్రహాలు కలసి ఉంటాయి. మరికొన్ని గ్రహాలు ఉండకూడదని స్థానంలో ఉంటాయి. అయితే గ్రహాలు కలసి ఉండడం మంచిదే కానీ కొన్ని గ్రహాలతో కలిస్తే మాత్రం ఆయా  వ్యక్తి ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం, బంధాలు, అక్రమ సంబంధాలు..వీటన్నింటిపైనా ఆ ఎఫెక్ట్ ఉంటుంటున్నారు.అలా కలవకూడని కొన్ని గ్రహాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. 

Also Read: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నలుగురి సలహాలు తీసుకోకండి..!

 • జాతకంలో బృహస్పతి, శుక్రుడు, శని కలిసి ఉంటే జాతకుడి స్వభావం చాలా బలంగా ఉంటుంది. మంచి ప్రవర్తనతో అందర్నీ మెప్పిస్తారు
 • సూర్యుడు-శని, చంద్రుడు-శని , సూర్యుడు-చంద్రుడు జాతకంలో కలసి ఉంటే వారు కొంత అసహనంతో ఉంటారు. తమ సంబందాలను హ్యాండిల్ చేయడంలో కొంతవరకూ విఫలం అవుతారు. అయితే ఈ కలయికలో గురువు కూడా పాల్గొంటే మాత్రం ఎలాంటి పరిస్థితులను అయినా తన అదుపులోకి తెచ్చుకోగలుగుతారు.
 • జాతకంలో గురు, శని, గురు శుక్ర గ్రహాల కలసి ఉన్నా లేదా ఒకదానికి ఎదురుగా మరొకటి ఉన్నా వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనా విధానం బావుంటుంది. ఎవ్వరినీ మోసం చేయలేరు..బంధాలను బలంగా మెంటైన్ చేస్తారు
 • కుజుడు, శుక్రుడు లగ్నం... ఏడో ఇంట్లో కూర్చుంటే ఆ జాతకులు ఓ వ్యక్తితో ఆగిపోరు..వీరిది చాలా విశాల హృదయం మనసులో ఎంతమందికి అయినా చోటివ్వగలరు. అయితే ఈ గ్రహాలతో పాటూ గురువు కలిస్తే ఆ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి లేదంటే అశుభమే.
 • కుజుడు, శుక్రుడు ఏడు లేదా ఎనిమిదో స్థానంలో ఉంటే ఆ జాతకులకు చాలామందితో సంబంధాలుంటాయి. వీరి స్నేహితుల జాబితా కూడా పెద్దదే
 • ఏ వ్యక్తి జాతకంలో అయినా బృహస్పతి, శుక్రుడు, శని గ్రహాలు కలిస్తే వారి గుణం చాలా మంచిది. క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వీరు బంధాలకు చాలా విలువనిస్తారు.
 • సూర్యుడు చంద్రుడు, శుక్రుడు లేదా చంద్రుడు, కుజుడు - బుధుడి కలయిక అయితే ఆ జాతకులు ప్రకాశవంతంగా ఉంటారు. ఎవ్వరినైనా ఆకట్టుకోవడంలో వీరు నిష్ణాతులు
 • జాతక చక్రంలో బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఏడో ఇంట్లో, రాహువు లగ్నంలో ఉంటే జాతకుడి స్వభావం అస్సలు మంచిది కాదు. వీరి ఆలోచనలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయి. చివరకు భార్యను కూడా తప్పుడుపనులు చేయించడానికి ప్రేరేపిస్తారు.
 • మీ జాతకచక్రంలో లగ్నాధిపతి..రెండు లేదా ఆరో స్థానంలో ఉన్న గ్రహాలతో ఏడో స్థానంలో కలిస్తే మాత్రం ఆ జాతకులు ఒక్క బంధంతో ఆగిపోలేరు.
 • బుధుడు శుక్ర గ్రహంలో కూర్చున్నా, కుజుడు ఏడవ ఇంట్లో చూసినా జాతకుడి స్వభావం అనుమానాస్పదంగా ఉంటుంది
 • శుక్రుడు ఏడవ స్థానంలో రెండో ఇంట్లో ఉన్న అధిపతితో కలిసినా...రాహువు, కుజుడు కలిసినా ఆ వారికి చాలామందితో సంబంధాలుంటాయి. 

Also Read: ఈ ముగ్గురు వ్యక్తులతో అతి చనువు అత్యంత ప్రమాదకరం

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితుల నుంచి సేకరించింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 11 May 2023 02:13 PM (IST) Tags: Astrology navagraha Nine Planets in Hindu Astrology surya chandra Angaaraka budha guru mangal shani raahu kethu

సంబంధిత కథనాలు

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

టాప్ స్టోరీస్

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?