Chanakya Neeti Telugu: ఈ ముగ్గురు వ్యక్తులతో అతి చనువు అత్యంత ప్రమాదకరం
Chanakya Neeti Telugu: చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలు పొందుపరిచాడు. వాటిలో భాగంగా మనుషుల ప్రవర్తనపైనా చాలా విషయాలు ప్రస్తావించాడు. స్త్రీ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పిన విషయాలివి
Chanakya Neeti Telugu: అసమాన ప్రతిభతో మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలందుకున్న కౌటిల్యుడు…జీవితానికి సంబంధించిన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవారి, మగవారికి సంబంధించి చాణక్యుడు చెప్పిన ప్రతి మాటా తరాలు గడిచినా నిలిచిపోయేలా ఉంటుంది. అయితే చాణక్యుడికి స్త్రీలంటే చాలా చిన్నచూపు ఉందంటారంతా. తన నీతిశాస్త్రంలో ప్రస్తావించిన కొన్ని విషయాలే అందుకు కారణం. స్త్రీల స్వభావం గురించి చెప్పిన విషయాలు గమనిస్తే షాక్ అవుతారు..అవేంటంటే...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
- అబద్ధాలు చెప్పడం, స్వార్థం, అసూయ, కఠినంగా ప్రవర్తించడం, మూర్ఖత్వం , పరిశుభ్రతపాటించకపోవడం, క్రూరత్వం లాంటివి స్త్రీలలో ప్రధానంగా ఉండే అంశాలు అంటాడు చాణక్యుడు
- అందుకే స్త్రీలు ఎంతకష్టపడినా మగవారిని మించి ఎదగలేరన్నాడు
- పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి రెండు రెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కోరికలు ఎనిమిదిరెట్లు ఉంటాయి
- ఏ విషయంలోనైనా స్త్రీ భర్త అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోపోతే తనతో పాటూ భర్త ఆయుష్షు తగ్గుతుందట.
- యువతి అంద విహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చు కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కానప్పుడు అలాంటి యువతిని పెళ్లిచేసుకోరాదు
- మర్యాద ఎలా ఇచ్చి పుచ్చుకోవాలో రాజుల నుంచి... సంభాషణ ఎలా జరపాలో పండితుల నుంచి...
- అబద్ధం ఎలా చెప్పాలో జూదగాళ్ల నుంచి నేర్చుకున్నట్టే...స్త్రీల నుంచి కపటం, వంచన నేర్చుకోవాలట
- ఇత్తడి పాత్రలను బూడిద, రాగి పాత్రలను ఆమ్ల పదార్థాలు ఎలా శుభ్రంచేస్తాయో..స్త్రీలను రుతుక్రమం అలా శుభ్రం చేస్తుందని చెప్పాడు చాణక్యుడు
- రాజు, మత గురువు, పరాయి స్త్రీ..ఈ ముగ్గురితో అస్సలు చనువుగా ఉండరాదు..ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే
- ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే స్త్రీలతో మర్యాదగా, నెమ్మదిగా మాట్లాడితే వారిలో మార్పు వస్తుందని చెప్పాడు చాణక్యుడు.
Also Read: గడ్డిపై ప్రతీకారం తీర్చుకునేవాళ్లుంటారా ... కానీ చాణక్యుడి విజయం అక్కడి నుంచే మొదలైంది..
స్త్రీ గురించి ఇలా చెప్పిన చాణక్యుడు తల్లి గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పాడు..
ఒక వ్యక్తి భౌతిక సంపద ద్వారా పూర్తి ఉత్తముడు కాలేడని, కేవలం సంపద, హోదా అతని ఖ్యాతిని పెంచలేవంటాడు చాణక్యుడు. ఈ సంపద కన్నా, ఎన్ని చేతులు ఆ వ్యక్తిని ఆశీర్వదించాయి అన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటపడుతుంది అని తన అర్ధశాస్త్రంలో చెప్పాడు. 9 నెలలు కడుపులో భద్రంగా మోయడమే కాదు… బాహ్య ప్రపంచంలో మీ క్షేమం కోసం నిరంతరం పాకులాడే నిస్వార్ధ జీవి అమ్మ. బిడ్డ పుట్టక ముందు నుండే భాద్యతలు కలిగి ఉండే వ్యక్తి తండ్రి. దేవుడు భూమ్మీద అన్నిచోట్లా లేడు కాబట్టి అతను తల్లిదండ్రులను సృష్టించాడు. మీరు ఎంతగా ఎవరిని ప్రేమించినా, తల్లి ప్రేమను మాత్రం భర్తీ చేయలేరంటాడు. అందుకే తల్లిదండ్రులను అవమానపరిచే విధంగా మాట్లాడడటం తగదని శిష్యులకు బోధించాడు చాణక్యుడు.