(Source: ECI/ABP News/ABP Majha)
Chanakya Niti: గడ్డిపై ప్రతీకారం తీర్చుకునేవాళ్లుంటారా ... కానీ చాణక్యుడి విజయం అక్కడి నుంచే మొదలైంది..
ఎవరిపైన అయినా పగ, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు తిరిగి మళ్లీ లేచే అవకాశం కూడా ఇవ్వకూడదంటాడు చాణక్యుడు. అందుకే గడ్డిపై మొదలైన తన ప్రతీకారం నందవంశ నిర్మూలన వరకూ వెళ్లింది.
మగధ దేశాన్ని ధననందుడు పాలించే రోజులవి. నందవంశంలో అతడే ప్రసిద్ధుడు. ధననందుడు గొప్ప వీరుడే కానీ ప్రజాభిమానం పొందలేకపోయాడు. అహంభావి, క్రూరుడు అయిన ధననందుడు తన మంత్రి కాత్యాయనుడిని, కుమారులను బంధించి వేధించాడు. హింస భరించలేక కాత్యాయనుడి పిల్లలంతా చనిపోయారు. కొన్నాళ్ల తర్వాత కాత్యాయనుడి తప్పు లేదని తెలుసుకుని విడిచిపెట్టి మంత్రిగా కొనసాగించాడు ధననందుడు. కానీ తన పిల్లల్ని చంపిన రాజుపై పగ అలాగే ఉండిపోయింది. పైకి మామాూలుగా ఉన్నా పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూశాడు. అలాంటి సమయంలో కనిపించాడు చాణక్యుడు.
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
రాజ్యంలో అంతమంది ఉన్నా కాత్యాయనుడి చూపు చాణక్యుడిపై ఎందుకు పడింది..తను మాత్రమే ధననందుడి అహం అణచగలడు అని ఎందుకు అనిపించందంటే ఇక్కడ చాణక్యుడి తండ్రి చనకుడి మరణం గురించి చెప్పుకోవాలి. ఉన్నత విద్యాబుద్దులు, వేదాలు నేర్పించిన తండ్రి శాశ్వతంగా దూరమవడాన్ని చాణక్యుడు తట్టుకోలేకపోయాడు. తండ్రి మృతదేహం దగ్గర కూర్చుని ఏడుస్తున్న చాణక్యుడికి ఓ వార్త తెలిసింది. ఇంటి చుట్టూ సూదుల్లా ఉన్న గడ్డిపై నడిచిన సమయంలో తండ్రి కాలికి గాయం అయిందని.. ఆ గాయం పెద్దదై చనిపోయాడని తెలిసింది. ప్రతీకారం తీర్చుకోవాలన్న మొదటగా వచ్చిన సందర్భం అదే అని చెప్పాలి.
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
తండ్రి అంత్యక్రియలు పూర్తైన మర్నాటి నుంచి చాణక్యుడు ఇంటి ఆవరణలో ఉన్న గడ్డిని పెకిలించడం మొదలు పెట్టాడు. గడ్డిని పెరికి మొదట్లో పంచదార నీళ్లు పొయ్యడం ప్రారంభించాడు. ఈపనిని గమనించిన మంత్రి కాత్యాయనుడు దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. సూదుల్లాంటి ఈ గడ్డిపై పాదం మోపడం వల్ల తన తండ్రి చనిపోయాడని అందుకే గడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటున్నా అన్నాడు. ఆశ్చర్యపోయిన కాత్యాయనుడు గడ్డి మళ్లీ మొలవకుండా ఉంటుందా అంటే...అందుకే పంచదార నీళ్లు పోస్తున్నా అని బదులిచ్చాడు చాణక్యుడు. పంచదార నీళ్ల వల్ల చీమలు చేరి మొదలు వరకూ కొరికేస్తాయని క్లారిటీ ఇచ్చాడు. చాణక్యుడిలో కసి, పట్టుదల చూసిన కాత్యాయనుడు ఇలాంటి వ్యక్తికోసమే కదా వెతుకుతున్నా అని మనసులో అనుకున్నాడు. ఆ క్షణం చాణక్యుడిని ధన నందుడిపై ప్రయోగించాలన్న కాత్యాయనుడి నిర్ణయం... గడ్డిని పూర్తిగా పెకిలించి మొలవకుండా చేసినట్టే నంద వంశం సమూలంగా నాశనమయ్యేందుకు దారి తీసింది. అంటే ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఆ క్షణం గెలిచి వదిలేయడం కాదు.. మళ్లీ తిరుగుబాటు చేయాలనే ఆలోచన చంపేయడం, ఆ అవకాశం లేకుండా చేయడమే అన్నది చాణక్యుడి ఉద్దేశం.
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి