చాణక్య నీతి: ఈ నాలుగు తప్ప ప్రపంచంలో ఉన్నవన్నీ పనికిరానివే
నత్రోదక్ సమంద్ దానం న తిథి ద్వాదశి సమా । న గాయత్ర్యః పరో మన్త్రం న మాతుదేవతాం పరమ్ ।।
తప్పనిసరిగా ఆచరించాల్సిన 4 విధులపై ఈ శ్లోకం చెప్పాడు ఆచార్య చాణక్యుడు
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ప్రపంచంలో చేయవలసినవి నాలుగు విధులు మాత్రమే. వీటిని అనుసరిస్తే ఆనందం పొందనివారుండని శిష్యులకు బోధించాడు
ఈ ప్రపంచంలో దానానికి మించినది ఏదీ లేదు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఈ భూమిపై ఉన్న ఏకైక గొప్ప దానం అన్నం, నీరు.
ఈ రెండింటి ముందూ ప్రపంచంలో ఏ వస్తువూ విలువైనది కాదు. ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం, దప్పికతో ఉన్నవారికి నీరు ఇచ్చే వ్యక్తి కంటే గొప్ప పుణ్యాత్ముడు లేడు.
ఆచార్య చాణక్యుడు ఏకాదశి తిథిని అత్యంత పవిత్రమైన తిథిగా పరిగణించారు.
ఏకాదశి తిథి రోజు దైవారాధన చేయడం, ఉపవాసం చేయడం, పవిత్రంగా ఉండటం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహిస్తాడని పేర్కొన్నాడు చాణక్యుడు
ఆచార్య చాణక్యుడు గాయత్రీ మంత్రాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రంగా పేర్కొన్నాడు. గాయత్రి దేవిని వేదమాత అంటారు. నాలుగు వేదాలు ఆమె నుంచే ఉద్భవించాయి.
ఈ భూమిపై తల్లిని మించిన వారు ఎవరూ లేరు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. తల్లిని మించిన దైవం లేదు, తీర్థయాత్ర లేదు, గురువు లేదు.
తల్లికి సేవ చేసే వ్యక్తికి ఈ లోకంలో తీర్థయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నాడు ఆచార్య చాణక్యుడు