ABP Desam


వాస్తు ఇలా ఉంటే మానసిక బాధలు తప్పదు!


ABP Desam


ఇంట్లో భయం గొలిపే చిత్రాలు పెట్టుకోవద్దు. ఉగ్ర రూపంలో ఉండే దేవుడి బొమ్మ లేదా విగ్రహం కూడా పెట్టుకోవడం మంచిదికాదు. హింసను సూచించే ఎలాంటి చిత్రాన్ని ఇంట్లో ఉంచకూడదు. వీటి వల్ల ఇంట్లో నెగెటివ్ శక్తి పెరిగి మానసిక అశాంతి తప్పదు.


ABP Desam


ఇంట్లో పెద్ద వారు ఎప్పుడూ నైరుతిలో పడుకోవాలి. పాదాలు పడమర దిశలో, ఉత్తరం వైపు తల ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి. తల ఆగ్నేయంలో ఉంటే మంచిది. నిద్రించేందుకు సరైన దిశను ఎంచుకోవాలి. లేదంటే మానసిక సమస్యలు రావచ్చు.


ABP Desam


ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పెట్టుకోవద్దు. ఇంట్లో ప్రతికూలతకు ఇవి కారణం కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు కూడా ఇది ఒక కారణం కావచ్చు. అందుకే వీలైనంత త్వరగా విరిగిన వస్తువులను ఇంట్లోనుంచి దూరంగా పారెయ్యాలి.


ABP Desam


ఇంట్లో అద్దం దక్షిణం లేదా పడమర గోడకు అమర్చకూడదు. ఈ దిక్కున ఉన్న అద్దం ప్రతికూల ప్రభావాలకు కారణం అవుతుంది. ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే తీసెయ్యాలి. ఇది మానసిక అశాంతికి కారణం కావచ్చు.


ABP Desam


ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కూడా అభివృద్ధి నిరోధకంగా మారుతుంది. ఫలితంగా మానసిక అశాంతికి కారణం అవుతుంది.


ABP Desam


ఎప్పుడూ పిల్లర్ కింద కూర్చుని పనిచెయ్యకూడదు. ఇది తలనొప్పి లేదా మానసిక అశాంతి కి కారణం అవుతుంది.


ABP Desam


ఇంట్లో వాష్ రూమ్ లు మూసి పెట్టి ఉంచాలి. తెరచి ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరి అది మానసిక అనారోగ్యానికి కారణం అవుతుంది.


ABP Desam


పూజ స్థలం ఇంట్లో ఈశాన్యంలో ఉండాలి. ఈశాన్యం లో లేదా తూర్పు దిశలో నీటిని నిల్వ చెయాలి. లేదా నీటి తొట్టి లేదా కలశం వంటిది ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఇది ఇంట్లోని మహిళల మానసిక స్థితి మీద చాలా ప్రభావం పడుతుంది.


ABP Desam


ఇంట్లో వాడని మందులు లేదా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఉంటే వెంటనే బయట పడెయ్యాలి. ఇది చాలా పెద్ద నెగెటివ్ ఎనర్జీగా మారుతుంది.


ABP Desam


Images Credit: Pinterest