గరుడపురాణం: చేతిలో డబ్బు నిలవకపోవడానికి ప్రధాన కారణాలివే!
గరుడ పురాణం ప్రకారం, ఇతరుల భూమి లేదా సంపదను బలవంతంగా లాక్కోవడం మహాపాపం. ఇలాంటి తప్పులు చేసేవారు జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు. లక్ష్మీదేవి వారిపై కోపగించుకుంటుంది
పేదలను లేదా నిస్సహాయులను దోపిడీ చేసి డబ్బు సంపాదించే వారి ఆస్తి చాలా త్వరగా నాశనం అవుతుంది. అలాంటివారు ఎంత ధనవంతులైనా వారిని క్రమంగా పేదరికం ఆవహిస్తుంది.
శుభ్రత లేని వారి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని గరుడ పురాణంలో చెప్పారు. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
రాత్రి పూట భోజనం చేసి పడుకునే ముందు పాత్రలు, వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న పాత్రలను తోమకుండా ఉంచడం వల్ల ఇంట్లోని వ్యక్తలను దురదృష్టం వెంటాడుతుంది.
మితిమీరిన కోపం ఉన్న వ్యక్తి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు. ప్రతి విషయంలోనూ అరిచే ఇలాంటివారు భార్యాపిల్లలపై ఎప్పుడూ కోపంగానే ఉంటారు. ఆ వ్యక్తి ప్రవర్తనే అతని ఇంటి పేదరికానికి ప్రధాన కారణం.
చాలా మందికి ఎప్పుడూ పళ్లు కొరకడం, గోళ్లు కొరికే చెడు అలవాటు ఉంటుంది. మీకు అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి. ఇలాంటి అలవాటు వల్ల చేతిలో డబ్బు నిలవదు అంటోంది గరుడపురాణం
కాళ్లు ఈడ్చడం కూడా మంచిది కాదు. కాళ్లు ఈడుస్తూ నడిచే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేరు. చాలా మందిలో ఈ చెడు అలవాటు మనం చూస్తుంటాం. మీకు అలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా ఈ రోజే మానేయడానికి ప్రయత్నించండి.
ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు