ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన కర్మల ఆధారంగా మరణానంతర జన్మ నిర్ణయమవుతుందని చెబుతుంది గరుడ పురాణం
స్త్రీని చంపినవాడు లేదా స్త్రీకి గర్భస్రావం చేసినవాడు నరకయాతన అనుభవించవలసి ఉంటుందని ఆ వ్యక్తి తదుపరి జన్మ చండాల జన్మ అని గరుడ పురాణం పేర్కొంది.
గరుడ పురాణం ప్రకారం..తల్లిదండ్రులను లేదా పిల్లలను సరిగా చూడనివారు తదుపరి జన్మలో భూమిపై పుట్టలేరు..తల్లి కడుపులో ఉన్నప్పుడే చనిపోతారు
స్త్రీని హింసించే వ్యక్తులు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడి తన జీవితాన్ని శారీరక బాధతో గడుపుతాడు.
పరస్త్రీతో సంబంధం పెట్టుకునే పురుషుడు వచ్చే జన్మలో బలహీనుడిగా పుడతాడు
గురువును గౌరవించని వారికి మరణానంతరం నరకమే. అలాంటి వారు మరుజన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుడతారు
గరుడ పురాణం ప్రకారం తమ జీవితంలో మోసపూరిత మార్గాన్ని అనుసరించిన వారు, ఇతరులను మోసం చేసేవారు వారి తదుపరి జన్మలో గుడ్లగూబ రూపంలో పుడతారు
అమాయకులపై తప్పుడు సాక్ష్యం చెప్పే వారు వచ్చే జన్మలో అంధత్వానికి గురవుతారు
గరుడ పురాణం ప్రకారం, తమ జీవితకాలంలో ఎవరినైనా చంపడం, దోచుకోవడం లేదా జంతువులను వేటాడడం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు తమ తదుపరి జన్మలో కసాయి చేతికి చిక్కే మేకగా జన్మిస్తారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు