మే 5 - వైశాఖ పౌర్ణమి రోజు ఎన్ని ప్రత్యేకతలో...



మే 5 శుక్రవారం వైశాఖ పౌర్ణమి. అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజంతా విష్ణుభగవానుడిని బుద్ధుని రూపంలో ఆరాధిస్తారు.ఇంకా ఈ రోజుకి చాలా ప్రత్యేకతలున్నాయి..



చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. ఉత్తరాయణంలో వచ్చే ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి



ఈ రోజు సముద్ర స్నానం ఆచరిస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతారు



ఈ రోజు జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి...ఇలా ఎన్నో విశేషాలున్నాయి



శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తింది ఈ రోజే
దేవతలు, రాక్షసులు అమృతం కోసం మందరపర్వతాన్ని కవ్వంగా ఉపయోగిస్తూ పాలసముద్రాన్ని మధించడం ప్రారంభించారు. అప్పుడు ఆ పర్వతం సముద్రంలోకి మునిగిపోకుండా ఉండేందుకు కూర్మావతారం ఎత్తాడు.



అన్నమాచార్యుల జయంతి
పదకవితా పితామహుడు అన్నమాచార్యుల జయంతి కూడా వైశాఖ పూర్ణమి రోజే



బుద్ధ పౌర్ణమి
వైశాఖ పౌర్ణమి రోజు సిద్దార్థుడు జన్మించడం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం, అదే రోజు నిర్యాణం చెందడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని చెబుతారు.



వైశాఖ పౌర్ణమి రోజు మొదటి చంద్రగ్రహణం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న వైశాఖ పూర్ణిమ రోజు.



Images Credit: Pinterest