గరుడ పురాణం: శవం దగ్గర ఎవ్వరూ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా! భగవద్గీతలో చెప్పినప్రకారం మరణంతో కేవలం దేహం నశిస్తుంది. ఆత్మ మరో శరీర ధారణ చేస్తుంది అందుకే హిందూ ధర్మంలో మరణం తర్వాత కర్మకాండలు నిర్వహిస్తారు గరుడపురాణం ప్రకారం మరణానికి శాస్త్రంలో అంత ప్రాధాన్యత ఉంది. అంతిమ సంస్కారాలకు చాలా నియమాలు ఉంటాయి. శాస్త్రాన్ని అనుసరించి సూర్యాస్తమయం తర్వాత అంతిమ సంస్కాలు చెయ్యకూడదు వ్యక్తి మరణించిన తర్వాత అతడి శరీరం పూర్తిగా శాంతించే వరకు దహన సంస్కారాలు జరపరాదు చనిపోయిన వ్యక్తికి ప్రియమైన వారు కడసారిగా చూసేందుకు అవకాశం కల్పించాలి బంధుమిత్రుల సందర్శనార్థం కొంత సమయం పాటు శవాన్ని ఉంచినపుడు శవం దగ్గర తప్పకుండా మనుషులు ఎవరో ఒకరు ఉండాలి గరుడ పురాణాన్ని అనుసరించి శవాన్ని ఒంటరిగా వదిలేస్తే శవంలో ప్రేతాత్మలు వచ్చి చేరే ప్రమాదం ఉంటుందట అది ఆ శరీరానికి, కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదకరం కావొచ్చు. అందుకే శవజాగారం అంటారు Images Credit: Pinterest