పెళ్లిలో బాసికం ఎందుకు కడతారు



హిందూ వివాహ పద్ధతిలో వధూవరులకు నుదుటన బాసికం కడతారు



వధూవరులు నుదుటన ధరించే 'బాసికం' ఓ అందమైన అలంకారంగా కనిపిస్తుంది.



ఇలా కట్టడం వెనుక శాస్త్రీయపరంగా, హిందూ ధర్మం – ఆచారాల పరంగా కూడా ఆంతర్యం ఉంది



మానవ శరీరంలో మొత్తం 72వేల నాడులు వుంటాయి. అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి.



ఈ నాడుల వల్ల మానవ శరీరంలో ఎల్లప్పుడూ ఉత్తేజ పరిస్థితిలో వుంటుంది. అయితే ఈ 14 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు చాలా ముఖ్యమైనవి.



సుషుమ్న అనే నాడికి కుడివైపున సూర్యనాడి… ఎడమవైపు చంద్రనాడులు వుంటాయి. ఈ రెండు నాడులు కలిసే ప్రాంతం ముఖంలోని నుదుట మధ్య భాగం.



ఈ రెండు నాడుల కలయిక అర్థచంద్రాకారంలో వుంటుంది



ఋషులు ఈ ఆకారాన్ని దివ్యచక్షవు అనే పిలిచేవారు. దీనిపై ఇతరుల దృష్టి పడి దోషం కలగకుండా వుండేందుకు వధూవరుల నుదుటన బాసికం కడతారు.



బాసికం అర్థచంద్రాకారంలోగానీ, త్రిభుజాకారంలోగానీ వుంటుంది. బాసికం కడితే ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు రాకుండా వుంటాయని ప్రజల విశ్వాసం.



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం.



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

కొత్త బట్టలకు పసుపు పెట్టకుండా వేసుకుంటే ఏమవుతుంది!

View next story