పెళ్లిలో అల్లుడి కాళ్లు ఎందుకు కడుగుతారు భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తన కంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తలమీద, భార్య తలమీద చల్లుకుంటారు ఇదే ప్రక్రియ వేదకాలంలోనూ కనిపిస్తుంది..ఎందుకిలా చేస్తారు ‘సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీమహాలక్ష్మీ స్వరూపి శ్రీం కన్యామ్’ అనేది వివాహమంత్రం వివాహమైన రోజున వరుడు పేరు ఏదైనా, వయసు ఎంతైనా తను లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక వరుడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు అందుకే వరుడి పాదాలు కడిగి దానిని గంగాజలంగా భావించి తలపై చల్లుకుంటారు పెళ్లికూతురు మహాలక్ష్మీ స్వరూపిణియే. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు పెళ్లికి వెళ్లడం అంటే.. శ్రీలక్ష్మీనారాయణులను దర్శించడమే అంటారు పండితులు గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. Images Credit: Pinterest