మరణానంతరం ఆత్మ ప్రయాణం మాత్రమే కాదు మనిషిగా జీవిస్తున్నప్పుడు కూడా పాటించాల్సినవి వివరించింది గరుడ పురాణం
ముఖ్యంగా జీవితంలో ఎలాంటి వ్యక్తిని, వస్తువులను విశ్వసించకూడదో వివరించారు
గరుడ పురాణం ప్రకారం మీ కంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను విశ్వసించడం మానుకోండి. ఈ వ్యక్తులకు మీ రహస్యాలను ఎప్పుడూ చెప్పకండి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు, వారు మీ రహస్యాలను వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు
నిప్పు ఎప్పుడూ ప్రమాదకరమే. సరైన సమయంలో మంటలను అదుపు చేయడం చాలా ముఖ్యం. అలాగే లోపల మనపై అంతులేని ద్వేషాన్ని పెంచుకుని, పైకి ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అవకాశం కోసం ఎదురుచూసే వాళ్లను గుర్తించి దూరంగా ఉండాలి.
పాము తన పిల్లలనూ వదలనట్లే అలాంటి విషపు మనస్తత్వం ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కూడా వదలరు. మీరు మేలు చేసినా మీకు కీడు తలపెట్టాలని భావించే వారికి దూరంగా ఉండాలి.
విశ్వాస ఘాతకులు మిమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తుంటారు. అలాంటి వారిని పెంచి పోషించకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలి.
ఇంటి సేవకుడికి మీ రహస్యాలు ఎప్పుడూ చెప్పకూడదు. సేవకుడు డబ్బుపై ఆశతో ఎప్పుడైనా వాటిని బయటపెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పకపోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
ఈ నలుగురినీ మనం ఎప్పుడూ నమ్మకూడదని గరుడ పురాణంలో స్పష్టంచేశారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటామని తెలిపారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.