కాకి ఇంట్లోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? అలా ప్రవర్తిస్తే మరణమా?

ఈ మధ్య సినిమాల్లో కూడా కాకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి కాకి దేనికి చిహ్నం? మంచికా? చెడుకా?

కాకి శని దేవుడి వాహనం. కానీ చెడు కాదు. ఇంట్లోకి వస్తే శుభమే.

కాకి ఇంటి ముందు కూర్చొని చెడు స్వరంతో అరిస్తే అశుభం.

కాకి ఎగురుతూ మీ ఇంటి దగ్గరకు వస్తే ఇంటికి పెద్దలు ఆశీర్వదించేందుకు వచ్చారని అర్థం.

కాకి తల మీద తన్నితే ఏదో ప్రమాదం లేదా చెడు జరగబోతుందని అర్థం.

కాకి కలలోకి రావడం చెడు శకునం.

కాకి గాల్లో ఒకే చోట ఉండి రెక్కలు పదే పదే కొడుతుంటే మరణానికి సంకేతం.

కాకి ఆహారం తింటూ కనిపిస్తే మంచి జరుగుతుంది. అందుకే పెద్దలు కాకులకు ఆహారం పెట్టాలని చెబుతారు.

కాకి కావు కావుమని పదే పదే అరుస్తుంటే మీ ఇంటికి అతిథులు రాబోతున్నారని అర్థం.

కాకులు గుంపుగా ఇంటి చుట్టూ తిరగడం చెడు సంకేతం.

Image Credit: Pixels and Pixabay